గీసుగొండ, జూన్ 6 : ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అందించి అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఎలుకుర్తిలో సోమవారం విలేజ్ పార్కు, రైతు వేదిక, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అలాగే కోనాయిమాకుల గ్రామంలో క్రీడా ప్రాంగణానికి ప్రారంభోత్సవం చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ర్టాల్లో కూడా దళిత బంధును అమలు చేయాలని అక్కడి దళితులు కోరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను దేశ రాజకీయాల్లో రావాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీలకతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామని, మిగతా సమయాల్లో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. దళితబంధు అందరికీ రాదని ప్రతిపక్ష నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదన్నారు.
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పూండ్రు జైపాల్‌రెడ్డి, ఎంపీపీ భీమగాని సౌజన్య, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, నిమ్స్ దవాఖాన లైజనింగ్ అధికారి మార్త రమేశ్, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ మాధవరెడ్డి, సొసైటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్, నాయకులు భాస్కర్, తిరుపతిరెడ్డి, ఆరె కుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివాజీ, నాయకులు చందర్రావు, రాజశ్వర్రావు, శ్రీనివాస్, సర్పంచ్‌లు నాగేశ్వర్రావు, రమ, బోడకంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, అనిల్, నాగమణి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.