దుగ్గొండి, జూన్ 6 : సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారని, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మందపల్లి ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.44లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్యారంగంలో పెను మార్పులు తీసుకువస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
వెలుగులు నింపడమే లక్ష్యం..
ఆర్థికంగా చితికిపోయిన దళితులకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవితాల్ల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండల కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న హార్డ్‌వేర్, సిమెంట్ షాపు, సెంట్రింగ్ షాపులను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న దళితబందు పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకం నిరంతరంగా కొనసాగుతుందని, దశల వారీగా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, డీఈవో వాసంతి, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు మంద శ్రీనివాస్, రేఖంపల్లి సర్పంచ్ ఇమ్మడి యుగేంధర్, ఎంపీటీసీ రంపీస సోనీరతన్, ఏపీఎం రాజ్‌కుమార్, గోర్కటి రాజ్‌కుమార్, మంద అనిల్, పీఆర్ ఏఈ హరిదాస్యం వెంకటేశ్వర్లు, ఎంఈవో చదువుల సత్యనారాయణ, సర్పంచ్ మొగ్గం మహేందర్, హెచ్ఎం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి..
నర్సంపేట రూరల్ : దళితబంధు లబ్ధిదారుల కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలంలోని లక్నేపల్లి గ్రామంలో దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు లక్నేపల్లిలో మూడు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, ఉప సర్పంచ్ పరాచికపు సంతోష్, టీఆర్ఎస్ నాయకులు విజేందర్, బగ్గి రాజు, రమేశ్, నవీన్, కిశోర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.