మట్టెవాడ, జూన్ 6 : వరంగల్లోని కొత్తవాడకు చెందిన తంగెరాల శాలిని(22) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మట్టెవాడ ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలినిని రెండు సంవత్సరాల క్రితం ఖాదర్ పాషా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం రూ.5లక్షలు వరకట్నం తేవాలంటూ పాషా శాలినిని పుట్టింటికి పంపించాడు. ఈ క్రమంలో మానసిక వేదనకు గురైన శాలిని ఈ నెల 4న గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలో ఉండగా ఆమె తండ్రి భాస్కర్ ఎంజీఎం దవాఖానలో చేర్పించాడు. చికిత్స పొందుతూ శాలిని ఆదివారం రాత్రి మృతిచెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఖాదర్ పాషా, అతడి తల్లిపై వరకట్న వేధింపులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.