కరీమాబాద్/ఖిలావరంగల్/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, జూన్ 6: పట్టణాలు, నగరాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం పట్టణప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం 43వ డివిజన్లో ఆయన మేయర్ గుండు సుధారాణితో కలిసి పర్యటించారు. సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో గుర్తించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ, నాయకులు అక్కపెల్లి స్పందన్ పాల్గొన్నారు. అలాగే, 32, 39, 40, 41, 42 డివిజన్లలో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన పర్యటించారు. వారి వెంట పోశాల స్వామి, గుండు పూర్ణచందర్, బజ్జూరి రవి, ఈదుల రమేశ్, కలకోట్ల రమేశ్, భిక్షపతి, టీఆర్ఎస్ 40వ డివిజన్ అధ్యక్షుడు విజయ్ ఉన్నారు.
ఖిలావరంగల్‌లోని గౌడ, బట్టురాజులు, యాదవవాడలో అధికారులతో కలిసి 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయి ఉమా దామోదర్‌యాదవ్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల విజ్ఞప్తులను నమోదు చేసుకున్నారు. వారి వెంట నోడల్ ఆఫీసర్ నరేందర్, డివిజన్ ఇన్చార్జి శేఖర్, పీఏసీఎస్ డైరెక్టర్ నర్సయ్య, నాయకులు ఉన్నారు. 37వ డివిజన్లో పార్కు, క్రీడా స్థలం ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ బోగి సువర్ణాసురేశ్ అన్నారు. డివిజన్లోని పీహెచ్సీ పరిసరాలను శుభ్రం చేయించారు. టీఆర్ఎస్ డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నలిగంటి అభిషేక్, నవీన్, దిలీప్, నర్సింగం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో చార్‌బౌళి ప్రాంతంలో పట్టణప్రగతి పనులు చేపట్టారు. డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ఏఈ సతీశ్, వర్క్ఇన్స్పెక్టర్ అశోక్, అభినవ్, డివిజన్ అధ్యక్షుడు విజయభారత్ పాల్గొన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఆర్‌తోట పోచమ్మగుడి లైన్లో సమస్యలను గుర్తించారు.
వరంగల్ 12వ డివిజన్లోని గాంధీనగర్, శ్రీరామకాలనీ, మైనార్టీ కాలనీ, మంగలికుంటలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో సమస్యలు తెలుసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ ప్రతిభ, డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, కాశెట్టి వేణు, రామస్వామి, నర్సయ్య పాల్గొన్నారు. 13వ డివిజన్ గణేశ్‌నగర్, ఏకశిలానగర్‌లో పార్కులను శుభ్రం చేశారు. రోడ్డు వెంట పిచ్చి మొక్కలను తొలగించారు. 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టారు. 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్ఎస్ నాయకులు మంతుర్తి కుమార్‌యాదవ్, వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లాస్వామి పాల్గొన్నారు.
క్రీడాప్రాంగణాలను సిద్ధం చేయాలి
వరంగల్: క్రీడాప్రాంగణాల ఏర్పాటులో వేగం పెంచి త్వరగా సిద్ధం చేయాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని హ్యపీహోమ్స్, దేశాయిపేట, కొత్తవాడలో ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి క్రీడా ప్రాంగణాల స్థలాలను పరిశీలించారు. నర్సరీలు, పట్టణప్రకృతి వనాల పురోగతిని తెలుసుకున్నారు. పార్కుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎఫ్‌వో కిశోర్, ఈఈ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, డీఈ సంజయ్‌కుమార్, ఏఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
నాలుగు రోజుల్లో 1621 వినతులు
కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. నాలుగు రోజుల్లో 1621 వినతులు వచ్చాయి. ఒక్క సోమవారం రోజే వివిధ సమస్యలపై 636 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నర్సంపేటలో చురుగ్గా పనులు
నర్సంపేట: నర్సంపేటలో పట్టణప్రగతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణంలో చెత్త తొలగింపు పనులను ముమ్మరంగా చేస్తున్నారు. పలు వార్డులు, వీధుల్లో పిచ్చిమొక్కలను తొలగించి చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజినీకిషన్, కమిషనర్ వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.