పర్వతగిరి/ఖానాపురం, జూన్ 6: గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులు బాగున్నాయని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీపీవో స్వరూపారాణి కితాబిచ్చారు. మండలంలోని చింతనెక్కొండలో సోమవారం వారు పల్లెప్రగతి పనులను సందర్శించారు. వీధుల్లో జీపీ సిబ్బంది చేపట్టిన శానిటేషన్ పనులను సందర్శించారు. కార్యక్రమం అమలు తీరు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. చింతనెక్కొండలో చేపట్టిన క్రీడాప్రాంగణ నిర్మాణం చాలా బాగుందని జీపీ పాలకవర్గాన్ని మెచ్చుకున్నారు. అనంతరం సర్పంచ్ గటిక సుష్మను అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్, ఎంపీవో పాక శ్రీనివాస్, ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, కార్యదర్శి సరిత పాల్గొన్నారు. ఖానాపురం మండలవ్యాప్తంగా ఐదో విడుత పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఖానాపురం, బుధరావుపేట, ధర్మారావుపేట, అశోక్‌నగర్‌లో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులు నిర్వహించారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి
దుగ్గొండి/గీసుగొండ/చెన్నారావుపేట: సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య గామస్తులకు సూచించారు. మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీధులను శుభ్రం చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, సర్పంచ్ ముదరుకోల శారదాకృష్ణ, కార్యదర్శి సంతోష్‌కుమార్, ప్రత్యేకాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని గీసుగొండ మండల ప్రత్యేక అధికారి మురళీధర్‌రెడ్డి అన్నారు. కోనాయిమాకుల, గీసుగొండ గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రభాకర్, ఎంపీవో మోహన్‌రావు, సర్పంచ్‌లు డోలి రాధాబాయి, దౌడు బాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలవ్యాప్తంగా పల్లెప్రగతి పనులు కొనసాగుతున్నాయి. మండలకేంద్రంలోని సమస్యలను ఎంపీవో ప్రకాశ్, కార్యదర్శి సురేశ్‌కు ప్రజలు వివరించారు. ఉప్పరపల్లిలో కార్యదర్శి షకీల్ వీధులను శుభ్రం చేయించి పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు చేయించారు. మల్టీపర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.
గ్రామాలకు పండుగ శోభ
రాయపర్తి: పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలకు పండుగ శోభ వచ్చిందని మండల ప్రత్యేకాధికారి, జిల్లా మత్స్యశాఖాధికారి నరేశ్‌కుమార్‌నాయుడు అన్నారు. ఎంపీవో తుల రామ్మోహన్‌తో కలిసి సోమవారం ఆయన రాయపర్తి, రాగన్నగూడెం, గణేశ్కుంటతండా, పెర్కవేడు, సూర్యతండా, అవుసులకుంటతండా, కొత్తూరు, బంధన్పల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, కార్యదర్శుల సారథ్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నరేశ్‌కుమార్‌నాయుడు మాట్లాడుతూ ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తుండడంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా కనిపిస్తున్నాయని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలు, చెత్తాచెదారం తొలగింపుతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకుంటున్నట్లు వెల్లడించారు. రాయపర్తిలో వీధులతోపాటు ప్రధాన రహదారులను జీపీ సిబ్బంది శుభ్రం చేశారు. రాగన్నగూడెంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయించారు. కొండూరులోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో తెలంగాణ క్రీడా ప్రాంగాణం ఏర్పాటు కోసం సర్పంచ్ కర్ర సరితా రవీందర్‌రెడ్డి, గ్రామ ప్రత్యేకాధికారి కొయ్యాడ చంద్రమోహన్ నేతృత్వంలో మొరం పోయించి చదును చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శులు హేమలత, లక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి లక్ష్మయ్య, పలు సంస్థల ప్రతినిధులు మునావత్ నర్సింహానాయక్, రవినాయక్, పసునూటి సంతోష్‌కుమార్, పద్మ, దేశబోయిన ఉపేందర్, నేరెల్లి రాములు, కర్ర ప్రవీణ్‌రెడ్డి, శిరీష పాల్గొన్నారు.

జోరుగా అభివృద్ధి పనులు..
నర్సంపేటరూరల్: ఐదో విడుత పల్లెప్రగతి అభివృద్ధి పనులు మండలంలో జోరుగా కొనసాగుతున్నాయి. ముగ్ధుంపురం, గురిజాల, గుంటూరుపల్లి, రాజపల్లి, పాతముగ్ధుంపురం, రాజేశ్వర్‌రావు, మర్రినర్సయ్యపల్లి, భాంజీపేట, రామవరం, ఆకులతండా, భోజ్యానాయక్‌తండా, రాములునాయక్‌తండా, లక్నేపల్లిలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జీపీ సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీ, పశువైద్యశాల పరిసరాల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు ఫాతిమామేరి, మహేందర్, సత్యనారాయణ, అశోక్, వెంకటేశ్వర్లు, నితిన్, భాస్కర్, విద్య, లక్ష్మణ్, రజాక్, సందీప్, నవీన్ పాల్గొన్నారు.