నెక్కొండ, జూన్ 6 : ప్రజాప్రతినిధులు, అధికారం యంత్రాంగం, ప్రజలు పోటీపడుతూ పల్లెలను అభివృద్ధి చేసి రూపురేఖలను మార్చాలని కలెక్టర్ గోపి అన్నారు. మండలంలోని అప్పల్రావుపేట, వెంకటాపురం, తోపనపల్లి, అలంకానిపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను సోమవారం పరిశీలించారు. అప్పల్‌రావుపేటలో డంపింగ్‌యార్డ్‌ను సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి బడిబాటను పకడ్బందీగా నిర్వహించి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకునేందుకు కృషి చేయాలని హెచ్ఎం శ్రవణ్‌కుమార్‌కు సూచించారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో చేయాల్సిన పనులను సత్వరమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించా రు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి రికార్డుల ను పరిశీలించారు. వెంకటాపురం, తోపనపల్లి గ్రామాల నర్సరీల్లోని మొక్కలను పరిశీలించారు. వెంకటాపురంలో శ్మశానవాటిక బోర్‌కు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయించాలంటూ సర్పంచ్ కుమార్, రవీందర్రావు, సొసైటీ ఉపాధ్యక్షులు కలెక్టర్‌కు విన్నవించగా పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. తోపపల్లితో పాటు మండలంలోని రైతు వేదికల్లో పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని జేడీఏ ఉషాదయాళ్కు సూచించారు. రైతు వేదిక పనులను సత్వరం పూర్తి చేయాలని సర్పంచ్ ఫకీర్‌ను ఆదేశించారు. అలంకానిపేటలో పశువైద్యశాలకు మధ్యాహ్నం వరకే తాళం వేసి ఉండడాన్ని గమనించి కలెక్టర్ ఆరా తీశారు. కా గా, ఎంపీపీ జాటోత్ రమేశ్, సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఎంపీటీసీ కర్పూరపు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు సూరం రాజిరెడ్డి తదితరు లు వైద్యాధికారి పనితీరు బాగాలేదని ఫిర్యాదు చేశారు. పీహెచ్సీలో వైద్యాధికారి వారంలో మూ డు రోజులు మాత్రమే పనిచేస్తున్నారని, రెగ్యులర్ గా ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరా రు.
వైద్యాధికారి మరోచోట డిప్యూటేషన్ చేస్తున్నాడంటూ వైద్య సిబ్బంది కలెక్టర్‌కు తెలుపుగా డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. విధులను నిర్ల క్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలంకానిపేట చెరువులో కలుషిత నీరు చేరడం వల్ల చేపలు చచ్చిపోతున్నాయని, ఆ నీటిని తోడేసి బాగు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుం టుక సోమయ్య కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీపీవో స్వరూప, డిప్యూటీ తహసీల్దా ర్ రాజ్‌కుమార్, ఎంపీవో రవి, ఏపీవో జాకబ్, సర్పంచ్‌లు వడ్డె రజితాసురేశ్, కుమార్, ఫకీర్మియా, ఎంపీటీసీలు అపర్ణారవీందర్, సూరం రాజిరెడ్డి, గుంటుక సోమయ్య పాల్గొన్నారు.