మడికొండ : ‘నమస్తే తెలంగాణ’ 11వ వార్షికోత్సవం వరంగల్ యూనిట్ కార్యాలయంలో సోమవారం పండుగలా జరిగింది. మొదట ఆయా విభాగాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంత రం బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్ వివిధ విభాగాల ఇన్చార్జిలతో కలిసి కేక్ కట్ చేశా రు. స్వీట్లు పంచుకొని సిబ్బంది ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో వరంగల్ బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, ఎడిషన్ ఇన్చార్జి కనపర్తి రమేశ్, యాడ్స్ ఇన్చార్జి అప్పని సూరయ్య, సర్క్యులేషన్ ఇన్చార్జి సురేశ్‌రెడ్డి, ప్రొడక్షన్ రీజినల్ మేనేజర్ వేణుగోపాల్, టెక్నికల్ ఇన్చార్జి నజీర్, ఎలక్ట్రికల్ ఇన్చార్జి నిరంజన్, స్టోర్స్ ఇన్చార్జి ఖదీర్, డెస్క్ ఇన్చార్జిలు, సబ్ ఎడిటర్లు రామగిరి కిరణ్‌కుమార్, పీ శ్రీనివాస్, సోమనర్సయ్య, సీహెచ్ రాజేందర్, అశోక్, ఓంకార్, సీహెచ్ వెంకటస్వామి, యువరాజ్, సతీశ్, మహేందర్, రఘుపతి, ఫొటోగ్రాఫర్లు, అకౌంటెంట్ రవీందర్‌రెడ్డి, హెచ్ఆర్ శ్రీనివాస్, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.