వరంగల్ చౌరస్తా, మే 31 : కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పెట్రోల్ డీలర్లను బలి చేస్తున్నదని మ్మడి వరంగల్ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి అన్నారు. పెట్రోల్ డీలర్ల సమస్యల పరిష్కారంతో పాటు నిబంధనలు సవరించి అమ్మకాలపై కమీషన్ రేటును పెంచాలని కోరుతూ భారత్ పెట్రోలియం డిపో ఎదుట ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు స్టాప్ పర్చేజ్ (కొనుగోళ్ల బంద్) పాటించి, ధర్నా చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కొనుగోళ్ల బంద్‌లో భాగంగా వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ ముందున్న డిపో ఎదుట డీలర్ల అసోసియేషన్ సభ్యులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సవరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ డీలర్లకు చెల్లిస్తున్న కమీషన్ రేటును ఆరేళ్లుగా పెంచకుండా ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభు త్వం మోసం చేస్తున్నాయన్నారు.
15 రోజులకు ఒకసా రి అతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను అనుసరించి ధర నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిన కేంద్ర ప్రభుత్వం రోజు వారి ధర నిర్ణయాన్ని అనుసరించడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల నష్టం భరించాల్సి వచ్చిందన్నారు. ఎక్సైజ్ సుంకం త గ్గించడం వల్ల నష్టపోయిన డీలర్లను ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుందారపు అనిల్‌కుమార్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రావు, శ్రీనివాస్, మోహన్, రవీందర్‌రెడ్డి, సతీశ్‌కుమార్, పవన్‌కుమార్, నాగరాజు, మధన్మోహన్, సాయిరెడ్డి, ముకుందరెడ్డి పాల్గొన్నారు.