దుగ్గొండి, మే 26 : క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అనువైనా స్థలాల ఎంపికకు గ్రామస్తులు సహకరించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో క్రీడాప్రాంగణం ఏర్పాటు కోసం సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్తులు, మండఅ అధికారులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు హరిసింగ్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడానికి మండలంలోని ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో క్రీడాప్రాంగణానికి అనువైనా స్థలాలను ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులను, అధికారులకు గ్రామస్తులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీవో శ్రీదర్‌గౌడ్, సర్పంచ్ పాశం పోశాలు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడా మైదానం పనులు ప్రారంభం..
చెన్నారావుపేట : మండలంలోని ఖాదర్‌పేటలో గ్రామీణ క్రీడా మైదానం పనులను ఎంపీడీవో దయాకర్, సర్పం చ్ అనుముల కుమారస్వామి గురువారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన గ్రామీణ క్రీడా ప్రాంగణం కార్య క్రమంలో భాగంగా మండలంలోని 30 గ్రామ పంచా యతీలు, 19 హాబిటేషన్లో మొత్తం 49 క్రీడా ప్రాంగ ణాలను ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ఖాదర్‌పేట, కోనా పురం గ్రామాల్లో క్రీడా మైదానాలను ప్రారంభించేలా పనులు చేస్తామని తెలిపారు. ఈసీ కిశోర్, కార్యదర్శి వీరన్న, టీఏ మహేందర్, పీఈటీ నరసింహరాములు, కారోబార్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.