వరంగల్, మే 26 : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు త్వరగా ఏర్పాటు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పలు ప్రాంతాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించారు. అనంతరం డాక్టర్స్ కాలనీ, సీకేఎం కళాశాల, గోర్రెకుంట, క్రిష్టియన్ కాలనీలో పురోగతిలో ఉన్న తెలంగాణ క్రీడాప్రాంగణాల పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ క్రీడాప్రాంగణాలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్, వ్యాయామబార్లు, వాకింగ్ ట్రాక్‌లు ఉండాలని అధి కారులను ఆదేశించారు. ప్రతి ప్రాంగణానికి ప్రహరి నిర్మాణం చేపట్టాలన్నారు.
క్రీడా ప్రాంగణం చుట్టూ పచ్చ ఉండేలా చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే స్థానికులతో కార్పొరేటర్లు క్రీడా సమితిలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం క్రిష్టియన్ కాలనీలో కార్పోరషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరే టర్లు సురేశ్జోషీ, వస్కుల బాబు, మనీషా శివ కుమార్, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్‌వో కిశోర్, హెచ్‌వో ప్రిసిల్లా, ఈఈ శ్రీనివాస్, డీఈ నరేందర్, ఏసీపీ బషీర్, ఏఈలు కార్తిక్‌రెడ్డి, కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయ కులు కుందారపు రాజేందర్, రాజేశ్, జగదీశ్వర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.