ఖిలావరంగల్, ఏప్రిల్ 17: ఖిలావరంగల్ మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో నిర్వహించిన ఈస్టర్ వేడుకులకు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక క్రైస్తవులతో కలిసి ప్రార్థనలు చేసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, బోగి సురేశ్, మాజీ కార్పొరేటర్ బిల్ల కవిత శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.
కాశిబుగ్గలో..
కాశీబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ అస్సీ స్కూల్ చర్చి లో ఈస్టర్ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అంధులకు పండ్లు పంపిణీ.. 
నగరంలోని కొత్తవాడలో గల లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలలో విద్యార్థులకు ఈస్టర్ పండుగ సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో డాక్టర్ నర్మెట ప్రేమ్‌కుమార్ పండ్లు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరు పేదలకు సాయం అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు పోలేపాక మార్క్, సునీల్, జీ రవి, నర్మెట్ట చిన్న, ఆదిత్య, మస్కి సతీశ్, అరుణ్, కన్నీ, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఈస్టర్ డే వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ..
గీసుగొండ: మండలంలో ఆదివారం వివిధ గ్రామాల్లో ఈస్టర్ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల గ్రామంలో ఈస్టర్ వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు వైభవంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల మనోహర్, మాజీ కార్పొరేటర్ బాలయ్య, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, రైతుబంధు కోఆర్డీనేటర్ గజ్జి రాజు, నాయకులు వేణు, శివకుమార్, బాబు, నవీన్‌కుమార్, గీసుగొండ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, గీసుగొండ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజుకుమార్, స్థానిక నాయకులు, క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేటలో ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. నర్సంపేట కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ రూబెన్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగ క్రైస్తవులకు శుభప్రదమైనదన్నారు. చెన్నారావుపేటలోని తిమ్మరాయిన్ పహడ్లోనూ ఈస్టర్వేడుకలను క్రిస్టియన్లు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.