కరీమాబాద్, ఏప్రిల్ 16: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. రంగశాయిపేటలోని మహంకాళి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి స్వామి చైతన్యానంద ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు. హన్మకొండలోని పద్మాక్షి ఆలయం సమీపంలోని హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంజనేయుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
కాశీవిశ్వేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం
కాశీబుగ్గ: నగరంలోని కాశీబుగ్గలో ప్రసిద్ధ కాశీవిశ్వేశ్వర దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో బయ్యస్వామి, గోనె జగదీశ్వర్, కృష్ణమూర్తి, భిక్షపతి, కొమురయ్య, వైకుంఠం, సుందర్, శ్రీరాములు, రమేష్, ప్రభాకర్ పాల్గొన్నారు. రంగ నాయకుల దేవాలయంలో హనుమాన్కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వంగరి రవి, సురేష్, సదానందం, ప్రభాకర్, సమ్మయ్య, సృజన, సమ్మక్క, కవిత, రోజా, కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని బాలాంజనేయస్వామి ఆలయం, రాజేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామి, ఇల్లంద రామలింగేశ్వరాలయంలోని ఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.
ఖానాపురం: హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మండల కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ను విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ తీశారు.
నర్సంపేట: నర్సంపేట పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి పట్టణంలో బైక్ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో మోతే సమ్మిరెడ్డి , మల్యాల రవి, పవన్, హరీష్, రాణాప్రతాప్, జగన్, నర్సింహులు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.