నర్సంపేట, ఏప్రిల్ 16: ఏసుక్రీస్తు శిలువలో తన పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారని, ఈ వార్తను అనేకులకు తెలియపరుస్తూ ఈస్టర్ పండుగ ముందు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమ కన్వీనర్ పాస్టర్ రూబెన్ తెలిపారు. నర్సంపేట పట్టణంలో స్థానిక బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలో నెక్కొండ రోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. షాలోమ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో చేపట్టిన రన్‌ను నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుశ్యంత్‌రెడ్డి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూబెన్ మాట్లాడారు. కార్యక్రమంలో పాస్టర్లు ఆర్.కొమురయ్య, శ్రీధర్, కోఆప్షన్ సభ్యురాలు పరికి జ్యోతీ ప్రశాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: ప్రపంచ శాంతియే ఏసుక్రీస్తూ అభిమతమని సర్పంచు బానోతు పూల్సింగ్నాయక్ అన్నారు. మండలంలోని మూడుచెక్కలపల్లిలో శనివారం పాస్టర్ అహోరోన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బేర్షబా బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుతూ గ్రామంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచు గూబ తిరుపతమ్మరాజు, పాస్టర్లు మత్తయ్య, రూబెన్, మనోహర్, సాల్మాన్, టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మూడు మంగీలాల్ పాల్గొన్నారు.