వరంగల్, మార్చి 15(నమస్తేతెలంగాణ): వరంగల్‌లోని జక్కలొద్ది వివాదాస్పద భూముల పై సమగ్ర విచారణ చేపడుతామని రాష్ట్ర మున్సిప ల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రక టించారు. జక్కలొద్ది గ్రామంలోని వివాదాస్పద భూములపై మంగళవారం శాసనసభలో వరంగ ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మా ట్లాడారు. వరంగల్‌లో జక్కలొద్ది అనే ఒక గ్రా మం ఉంది. ఆ గ్రామంలో మోహినిదిన్ ఖాద్రీ అనే వారి సంతతికి సంబంధించి 298.38 ఎక రాల భూమి ఉండేది. తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే పూనుకున్నామో ఆ స్థలాన్ని 30, 40 ఏండ్లుగా సాగు చేసుకునే రైతుల కోసం నాటి టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో భూపోరాటానికి నాంది పలికామని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్ర భుత్వం ఆ సమయంలో ఉన్న శాసనసభ్యులకు ఎరవేసి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటుకు కట్ట బెట్టిందని నన్నపు నేని పేర్కొన్నారు. ఆన్ 38 ఈ సర్టిఫికెట్ ప్రకారం టెనెన్స్కు భూములు ఇవ్వడా నికి ప్రధాన కారణం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభు త్వం. టెనెన్స్ను బెదిరించి, ఇబ్బందులకు గురి చేసి వారే ఓనర్లుగా ఉన్నారు. దీంట్లో వాస్తవాలు గుర్తించి పాసుపుస్తకాల్లో ఎవరు ఉన్నారో విచారణ చేయాలని నరేందర్ కోరారు. అసెంబ్లీలో దీనికి మంత్రి కేటీఆర్ సమాధానంగా జక్కలొద్ది భూము లపై సమగ్ర విచారణ చేపడ తామని అన్నారు.
కరీమాబాద్: ఇటీవల ఖిలావరంగల్ మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జక్కలొద్దిలోని సీలింగ్ ల్యాండ్ సర్వే చేపట్టిన విషయం విదితమే. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ గోపి అందుకు సంబంధించిన పత్రాలను, భూమిని పరిశీలించా రు. సంబంధిత అధికారులను అడిగి వివరాలు తె లుసుకున్నారు. వారం రోజులుగా రెవెన్యూ సి బ్బంది సర్వే చేసి 52 ఎకరాల భూమిని గుర్తించి వాటికి హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.