కరీమాబాద్, డిసెంబర్ 12 : ఉర్సులోని నాగమయ్యగుడిలో ఆదివారం మహా పడిపూజ అయ్యప్ప సేవా సమితి, అయ్యప్ప పరపతి సంఘం, హరిహరపుత్ర పరపతి సంఘం ఆధ్వర్యంలో కనుల పండువలా సాగింది. వందలాది మంది మాలధారుల అయ్యప్ప శరణుఘోషతో ఆలయమంతా భక్తి పారవశ్యం తో ఉప్పొంగింది. 18 ఏళ్లు పూర్తికావస్తు న్న నేపథ్యంలో 18 పడులతో ప్రత్యేకం గా పూజలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నాగేశ్వరస్వామి ఆలయ పూజారి శ్రీరామశర్మ ప్రత్యేక పూజలు చేసి అయ్యప్పస్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. మహాపడిపూజలో మేయర్ గుండు సుధారాణి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కార్పొరేటర్ పోశాల పద్మ, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ తదితరు లు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్-వాణి దంపతులు సం ప్రదాయ దుస్తుల్లో పూజలో కూర్చున్నా రు. జ్యోతి ప్రజ్వలన చేసి అయ్యప్పస్వా మి ప్రతిమకు పంచామృతాలతో అభిషే కం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగేశ్వరస్వామి, అయ్యప్పస్వామి ఆశీస్సులతో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అలా గే, ఈ నెల 25న సీతారామస్వామి అ య్యప్ప భక్తమండలి కుటీరం ఆధ్వర్యం లో కరీమాబాద్‌లోని రామస్వామిగుడి లో నిర్వహించనున్న మహా పడిపూజ వాల్‌పోస్టర్‌ను పెరుకవాడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గురుస్వామి దయ్యాల కృష్ణ పాల్గొన్నారు.