గీసుగొండ, జూలై 21: మొక్కలు నాటి సంరక్షించడం మనందరి బాధ్యత అని డీపీవో నాగపురి స్వరూపారాణి అన్నారు. మండలంలోని ఎలుకుర్తిలో గురువారం డీపీవో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె హరితహారంలో భాగంగా ప్రధాన రోడ్ల వెంట మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. వంద శాతం పన్నులు వసూలు చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పూండ్రు జైపాల్‌రెడ్డి, ఎంపీవో ప్రభాకర్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ మాధవరెడ్డి, కార్యదర్శులు నూనె వేణుప్రసాద్, పసునూటి కల్యాణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మానవాళి మనుగడకు దోహదం
నర్సంపేట: మానవాళి మనుగడకు మొక్కలు దోహదం చేస్తాయని నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు అన్నారు. నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలు ష్యం వల్ల విపత్తులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షిం చే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ చంద్రమౌళి మాట్లాడుతూ హరితహారంలో 300 మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట సీఐ పులి రమేశ్, ఎస్బీఐ నర్సంపేట మేనేజర్ రమేశ్, అధ్యాపకులు త్యాగయ్య, శ్రీనాథ్, శివనాగ శ్రీను, లకన్‌సింగ్, విష్ణుకుమా ర్, సుమతి, నరేందర్, ప్రసూన, శైలజ, స్వరూపారాణి, సాయినిసుల్తానా, సత్యనారాయణ, సమ్మయ్య, పూర్ణచందర్, శివ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకే హరితహారం
నల్లబెల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని ఏపీడీ వసుమతి అన్నారు. రంగాపూర్, ముచ్చింపులలో ఆమె హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేసి మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున నివాస ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటింటికీ ఆరు పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. రహదారులకు ఇరువైపులా అవెన్యూ మల్టీలేయర్, కమ్యూనిటీ ప్లాంటేషన్లను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, ఏపీవో వెంకటనారాయణ, కార్యదర్శులు పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
నర్సంపేట రూరల్: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రయ్యపల్లి ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి కోరారు. గురువారం రాంనగర్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఇంటి పరిసరాలు, పొలం గట్లపై మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణవేణి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.