ఖిలావరంగల్, జూలై 21 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందంటే సీఎం కేసీఆర్ సుపరిపాలనే కారణమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ 17వ డివిజన్ ఆదర్శనగర్లో రూ.4 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ ఆదర్శనగర్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికకి అధికంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. జానిపీరీల రైల్వేగేట్ నుంచి స్తంభంపల్లి గోదాముల వరకు సెంట్రల్ లైటింగ్, డబుల్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు.
రూ.కోటితో మరిన్ని అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఖబరస్తాన్కు రెండు ఎకరాల స్థలం, మహిళా భవనానికి రూ.10లక్షలు కేటాయించామని చెప్పారు. మరో రూ.20లక్షలు కూ డా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు పోతున్నవారికి డబుల్ బెడ్రూంలు అందజేస్తామన్నారు. విలీన గ్రామాల అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కార్పొరేటర్ గద్దె బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చొరవతో 17వ డివిజన్లోని ఆదర్శనగర్, స్తంభంపల్లి, వసంతపురం, దూపకుంట, గాడిపల్లి, బొల్లికుంటలో అభివృ ద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. డివిజన్ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమం లో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తీ భూమా త, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్, రైతుబంధుసమితి మండల కన్వీనర్ తరగల ప్రసాద్, బీసీ సెల్ అధ్యక్షుడు గోపగాని శంకర్, గ్రామ అధ్యక్షుడు నిమ్మకాయల రాజు, ఎండీ నజీరుల్లా, బొజ్జ యాదగిరి, జన్నుపాల రాంబాబు, సోల్తీ నరేందర్, నవీన్, టోని, రవి, యువరాజు పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్
పరకాల : అత్యవసర సమయంలో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన పేద ప్రజలకు సీఎంరిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 18 మందికి రూ.6.32 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, పలు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.