సుబేదారి, నవంబర్ 30: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో 11 రోజులపాటుగా నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాత్రి అమరుల కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు హనుమకొండ బాలసముద్రం ఏకశి లా పార్కు నుంచి అదాలత్ అమరవీరుల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కొనసాగు తోందని అన్నారు. తెలంగాణ సాధనకు ఆయన చేపట్టిన ఆమరణ నిరా హార దీక్షతో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారని అన్నారు.
ఉద్యమంలో అమరుల త్యాగాలు మరువ లేనివని కొనియాడారు. 52వ డివిజన్ కార్పొరేటర్ బోయిన పల్లి రంజిత్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష, అమర వీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందన్నారు. పోరాటాలతో సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అమ రుల కుటుంబాలను అండగా నిలిచిందని గుర్తుచేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియా మకాలతో రాష్ర్టాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారని కొనియా డారు. అభివృద్ధి, సంక్షేమ రంగం లో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని కొని యాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు రాములు, సోదా కిరణ్, పార్టీ నాయ కులు జనార్ద న్‌గౌడ్, నయీమొద్దీన్, బీ వీరేందర్, కరీమున్నీసా, పులి రజినీ కాంత్, రాంప్రసాద్, కంజర్ల మనోజ్, కేశవరెడ్డి, అంజలీదేవి, రఘు, అనిల్, రాజమణి తదితరులు పాల్గొన్నారు.
నేడు బైక్ ర్యాలీ
దీక్షా దివస్ల్లో భాగంగా గురువారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రేటర్ వరంగ ల్ కార్యాలయం దీక్షా దివస్ స్మృతి చిహ్నం నుంచి హను మకొండ అమరవీరుల స్తూపం వరకు ఈ ర్యాలీ సాగు నుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపా ధ్య క్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీన్ని విజ యవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, కార్మిక సంఘాలు, టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు, యూనియన్ల సభ్యులు పెద్ద ఎత్తున తరలిరా వాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు.