వర్ధన్నపేట, నవంబర్ 1: వరి పంటలో పొడతెగులు కనిపిస్తున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. కట్య్రాలలో మంగళవారం ఆయన వరి పంటను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా వరిలో ప్రస్తుతం ఆకుమచ్చ తెగులు, అగ్గితెగులు, సుడిదోమ తెగు లు ఆశించినట్లు తెలిపారు. ఎక్కువగా పొడతెగులు వస్తున్నందన నివారణకు టుబుకోనజల్, ట్రిప్లోస్ట్రోబిన్ 0.4 గ్రాములను లీటరు నీటిలో కలిసి పైరుపై పిచికారీ చేయాలని సూచించారు. అలాగే, వాముపురుగు ఉంటే ఆకులు తెల్లగా మారుతాయన్నారు.
నివారణకు క్లోరాంటెనిల్ప్రోల్ 0.3 గ్రాములను లీటరు నీటిలో కలిపి గాని క్టార్పఫ్హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. వరికంకినల్లి నివారణకు సైనోసైరపెన్ 120 ఎంఎల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండంకుల్లు నివారణకు కార్బన్డైజన్, మాంకోజెబ్ 20 గ్రాములు గాని హెల్పకోనజోల్, ప్రాపికోనోజల్ 2 ఎంఎల్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే కాండం కుళ్లును నివారించుకోవచ్చని ఏవో వివరించారు.
తెగులు నివారణ చర్యలు పాటించాలి
ఖానాపురంఅశోక్నగర్, చిలుకమ్మనగర్లో వరి పంటను ఏవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ వరిని ముదరు గోధుమ వర్ణపు ఆకుపచ్చ తెగులు ఆశించిందన్నారు. నివారణకు ప్రాఫికోనజోల్ 250 ఎంఎల్ను ఎకరం వరి పంటలో పిచికారీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ కమిటీ జిల్లా సభ్యుడు బొప్పిడి పూర్ణచందర్రావు, ఏఈవో సంతోష్ తదితరులు పాల్గొన్నారు.