గిర్మాజీపేట, మే 9 : టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 32వ డివిజన్ పరిధిలోని బీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, ఎన్ఎన్ నగర్, 25వ డివిజన్‌కు చెందిన మైనార్టీ, కాంగ్రెస్, బీజేపీకి చెందిన దాదాపు 100 మందికి క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ఏనాడు శత్రువులుగా చూడలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విమర్శకులు సైతం సలహాదారులు, శ్రేయోభిలాషులుగా మారుతున్నారని, అబద్దాల కోరైన కాంగ్రెస్, బీజేపీని జనం నమ్మరన్నారు.