పోచమ్మమైదాన్, జూన్ 4 : ప్రతి డివిజన్లో పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ ఎల్బీ నగర్లో శనివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టణాల అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపునకు పక్కా ప్రణాళికతో ముందు కు వెళ్తున్నారని తెలిపారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకుని సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎల్బీ నగర్లో అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేషన్ ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవికిరణ్, వార్డు ఆఫీసర్ రబ్బాని, మెప్నా ప్రతినిధి రమేశ్, సీడీపీవో విశ్వజ, సూపర్వైజర్ వెంకటేశ్వరి, నాయకులు బయ్య స్వామి, ఎండీ యాకూబ్ పాషా, గోరంటాల రాజు, ఆకెన వెంకటేశ్వర్లు, రాంపెల్లి శ్రీనివాసాచారి, బింగి మహేశ్, ముష్కె ప్రమీల, సమ్మక్క పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, మోమిన్‌పుర, రహ్మత్పుర, ఇస్లాంపుర, టెలికాం కాలనీ, లోతుకుంట, ఆదర్శ వీధి, తిలక్‌రోడ్డు, కాశీబుగ్గ రోడ్డు, తారకరామ వీధిలో కాలనీ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందులో యూత్, మహిళలు, సీనియర్ సిటిజన్స్, సేవాభావం గల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. ఈ కమిటీకి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల సెల్ నంబర్లు అందుబాటులో ఉంటాయని వివరించా రు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను గుర్తించి, కార్పొరేటర్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
గిర్మాజీపేట : వేంకటేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బట్టలబజార్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్ గందె కల్పనానవీన్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆల య కార్యనిర్వహణ అధికారి గుళ్లపల్లి శేషగిరి సభ్యులు గందె గోవిందరాజులు, గుమ్మడివెళ్లి సత్యనారాయణ, ఆత్మకూరు శ్రీనివాస్, బబ్బుల అశోక్, ముందాడ శ్రీగోపాల్, గందె విజయ్‌కుమార్, కొండూరు జ్ఞానేశ్వర్, అకినెపల్లి శ్రీనివాస్, ఈటెల ఉమామహేందర్, బజ్జూరి వైకుంఠం, గాదె జ్ఞానేశ్వర్, పగిడపల్లి పద్మ, బీ స్వాతితో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కొలిపాక శ్రీనాథ్, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.