సంగెం, జూన్ 4 : పల్లెప్రగతితో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పల్లెప్రగతి 5వ విడుతలో భాగంగా మండలంలోని గవిచర్ల, రాంచంద్రాపురం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గవిచర్ల గ్రామంలో రూ.35లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.12.50 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, గవిచర్ల, రాంచంద్రాపురంలో నూతనంగా ఏర్పా టు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. గ్రామంలో పోచ మ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అలాగే, సర్పంచ్ బోంపెల్లి జయశ్రీ-దిలీప్‌రావు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం గవిచర్లలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్లే రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీపీవో స్వరూపారాణి, డీఆర్డీవో ఎం సంపత్‌రావు, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు దొనికెల రమ-శ్రీనివాస్, ఎంపీటీసీలు సంపత్‌రెడ్డి, చిదిరాల రజిత, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పులుగు సాగర్‌రెడ్డి, నాయకులు దొనికెల శ్రీనివాస్, గోవర్ధన్‌గౌడ్, పత్తిపాక రమేశ్, దిలీప్‌రావు, చైర్మన్లు దొమ్మాటి సంపత్‌గౌడ్, కుమారస్వామి యాదవ్, ఉప సర్పంచ్ చెన్నూరి యాకయ్య, ఎంపీడీవో మల్లేశం, తహసీల్దార్ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.