శ్రీరాంపూర్, మే 25 : సింగరేణి ప్రాంతాల్లో స్థలాల్లో నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాలకు వారి నివాస స్థలాలను క్రమబద్ధ్దీకరణతో లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పిస్తామ ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వాకి బుధవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో రెవెన్యూ, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం విప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతీ హోళికేరి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లిదివాకర్రావు, జీఎం సంజీవరెడ్డి, గుర్తింపు కార్మిక సం ఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్‌తో కలిసి మంత్రి ప ట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి శ్రమజీవుల సంక్షేమం దిశ గా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని, తెలంగాణ వచ్చాకే కార్మికుల కష్టాలు తొలగాయని పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో దశాబ్ధాలుగా నివాసం ఉంటున్న కార్మిక, కార్మికేతర కుటుంబాలకు స్థలాలను క్రమబద్ధీకరిం చి సర్వ హక్కులు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. 2018 టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని 24 అం శాల్లో 23వ అంశమైన సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణ విషయాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో విజయవంతమైందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని 176 ఎకరాల సింగరేణి స్థ లంలో దాదాపు 2,843 మంది కార్మిక, కార్మికేతర కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
ఈ రోజు 842 మందికి పట్టాలు అందజేసినట్లు చెప్పారు. ఇక నుంచి లబ్ధిదారులకు భూమిపై పూర్తి హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎలాంటి ద ళారీ వ్యవస్థ లేకుండా శ్రీరాంపూర్ ఏరియాలోని అరుణక్కనగర్, సుందరయ్య కాలనీ, ఆర్కే-6 గుడిసెలు, వాటర్ ట్యాంక్ ఏరియావాసులకు పట్టాలు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ.. మిగిలిన స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి కూడా పట్టాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు.
పట్టాలతో మీ భూములకు అధిక ధరలు పలుకుతాయని తెలిపారు. తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని, అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ.. 76 జీవో ప్రకారం 176 ఎకరాల సింగరేణి భూమి ప్రభుత్వానికి అప్పగించడం వల్ల నివాసులకు పట్టాలు ఇవ్వడం జరుగుతున్నదని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ సకాలంలో రిజిస్ట్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో న స్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, అన్నయ్య, మల్లారెడ్డి, కేం ద్ర చర్చల ప్రతినిది ఏనుగు రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ భూమేశ్, కౌన్సిలర్లు పద్మ, లక్ష్మి, బౌతు లక్ష్మి, చీడం మహేశ్, కుమార్, హైమద్, నాసర్, గంగా ఎర్రయ్య, దాసు, సత్యనారాయణ, తిరుపతి, మొగిలి, పట్టణ అధ్యక్షుడు సుబ్బయ్య, నాయకులు విజిత్‌రావు, రాజేంద్రపాణి, జక్కుల రాజేశం, గురువయ్య పాల్గొన్నారు.