కేసముద్రం, మే 24 : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నదని మ హబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని సబ్ స్టేషన్ తండాలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారనే అసత్య ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఆ తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ప్రజలకు తాగునీరు అందించడంలో విఫలమయ్యారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో వేసవి వచ్చిందంటే తాగునీరు లేక ప్రజలు వ్యవసాయ బావు ల వద్దకు పరుగులు తీసేవారన్నారు. ప్రజ ల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు కేటాయించి మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. మారుమూల గ్రామాలు, తండాల్లోని ఇం డ్లకు స్వచ్ఛమైన భగీరథ నీరు సరఫరా అవుతోందన్నారు.
సబ్‌స్టేషన్ తండాలో ఉన్న సోలార్ పంపు సెట్ నీటిని తండావాసులు కొన్నేళ్లుగా తాగు నీటికి ఉపయోగిస్తున్నారన్నారు. సోలార్ పంపు నీరు వినియోగించడం వల్ల భగీరథ నీరు రావడం లేదు అనుకోవడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వేసవిలోనూ గ్రామాల్లోని చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయన్నారు. పేద ప్రజల ఇబ్బందులను తొలగించడం కోసం సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికి రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి నారాయణరావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహ్మద్ నజీర్ అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, కముటం శ్రీనివాస్, ఆగె వెంకన్న, గుగులోత్ సేవేందర్, సర్పంచ్ వెంకన్న ఉన్నారు.
కేసముద్రం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బానోత్ పవన్ కుమారుడు రిత్విక్ అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పరామర్శించారు. రిత్విక్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే, ఇనుగుర్తి మాజీ సర్పంచ్ సట్ల భిక్షం ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని భిక్షం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ దార్ల రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంకన్న, పింగిళి శ్రీనివాస్ పాల్గొన్నారు.