కేసముద్రం, మే 23: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా అందిస్తున్న పంట పెట్టుబడి సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు, కేంద్ర ప్రభుత్వం పీ ఎం కిసాన్ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2018లో కేం ద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పథకాన్ని ఏడాదికి 3 సార్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ సూచనల మేరకు కేంద్రం అందిస్తున్న 11వ విడుత పీఎం కిసాన్ డబ్బులను పొం దాలంటే రైతులు తప్పకుండా ఈ-కేవైసీ పూర్తిచేసుకోవాలని నిబంధన తీసుకువచ్చింది. మనీ ల్యాండరింగ్ నిరోధించడానికి, నకిలీ బ్యాంకు ఖాతాలను గుర్తించడానికి వీలు కలుగుతందని ఈ విధానాన్ని అమలులోకి తీసుకవచ్చింది. ఈ కేవైసీ పూర్తి చేసుకోని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యో అవకాశం లేదు.
పీఎం కిసాన్ పథకానికి ఈ-కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తొలుత మార్చి 31వ తేదీ వర కు ఈ-కేవైసీ చేసుకోవాలని గడువు విధించింది. ఈవిషయం రైతులకు తెలియకపోవడం, ఈ-కేవైసీ చేయకపోవడంతో గడువును మే 31 వరకు పెంచింది. అయి నా చాలామంది రైతులు ఈ-కేవైసీ చేయించుకోలేకపోయారు. మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాల్లో 1.4లక్షల మంది రైతులుండగా ఇప్పటి వరకు కేవలం 18వేల మంది మాత్రమే పూర్తి చేసుకున్నారు.
గతంలో ఆధార్‌కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసుకున్న వారు నేరుగా సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకు లింక్ చేసుకోని వారు తప్పకుండా మీసేవ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పేజీలో కుడి వైపున ఉన్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. సెర్చ్ నొక్కాలి. ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి ఒకే చేస్తే సరిపోతుంది.
పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. గడువు ఈనెల 31తో ముగుస్తుంది. ఇక పొడిగించే అవకాశం లేదు. మరో 5 రోజుల పాటు సమయం ఉన్నందున రైతులు సత్వరమే ఈకేవైసీ చేయించుకోవాలి. మొబైల్, ల్యాప్‌ట్యాప్, ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ చేయించుకోవచ్చు. ఈ విషయంపై గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తూ, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
-ఛత్రూనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి