వర్ధన్నపేట, మే 18: కొనగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను వెనువెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స సూచించారు. ఇల్లంద ఏఎంసీ, ప్రభుత్వ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన డీసీతండా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్ సప్లయ్ డీఎం ఇర్ఫాన్‌తో కలిసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్య లు తెలుసుకున్నారు. ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయడం లేదని పలువురు రైతులు శ్రీవత్స దృష్టికి తీసుకొ చ్చారు.
అలాగే, గన్నీ సంచుల కొరత ఉన్నట్లు నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూకం వేసిన ధాన్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం నాణ్యతను పరిశీలిస్తూ తాలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులు తొందరపడకుండా అధికారులకు సహకరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాల న్నారు. రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రాథమిక సహకారం సంఘం కార్యదర్శి వెంకన్న ఉన్నారు.
నెక్కొండ/ఖిలావరంగల్: తెలంగాణ ప్రభుత్వం రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము అన్నారు. వాగ్యానాయక్తండా, పెద్దకోర్పోలు, నాగారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.
వాగ్యానాయక్ తండాలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, సీఈవో మోడెం సురేశ్, పెద్దకోర్పోలులో సర్పంచ్ మహబూబ్‌పాషా, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ కర్ర సుకన్య, కర్ర బుచ్చిరెడ్డి, గాదె భద్రయ్య, సొసైటీ డైరెక్టర్లు మెండె వెంకన్న, పొరండ్ల రాంచందర్, సౌరపు శ్రీనివాస్, నాగారం సర్పంచ్ జల్లె సుదర్శన్, ఉప సర్పంచ్ సుభద్ర-బీరయ్య, సమ్మెట విజేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటుక సోమయ్య, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, టీఆర్ఎస్ మండల నాయకులు తాటిపెల్లి శివకుమార్, ఈదునూరి రమేశ్, ఈదునూరి యాకయ్య, తేజావత్ గోపీనాయక్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్ 17వ డివిజన్లోని వసంతపురంలో కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, వైస్ చైర్మన్ సోల్తి భూమాత ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు బండి బాబురావు, తోటకూరి నర్సయ్య, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు తరగల బాబురావు, ఆదర్శనగర్ కమిటీ అధ్యక్షుడు గోపగాని శంకర్, ఏఈవో చంద్రకాంత్, సీఈవో మైదం కుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కత్తెర దామోదర్, టీఆర్ఎస్ నాయకులు సోల్తి నరేందర్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/సంగెం: రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని శ్రీరామ ధాన్య విత్తన సంఘం అధ్యక్షుడు అర్శనపెల్లి మాధవరావు కోరారు. ముగ్ధుంపురంలో శ్రీరామ ధాన్య రైతు విత్తన ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార పరిమిత సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తేమ 17 శాతం కన్నా తక్కువగా ఉండేలా, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు సిద్ద సుధాకర్, చల్లా మల్లారెడ్డి, రాధారపు సాంబరెడ్డి, నాంపెల్లి సాంబయ్య, ఏఈవో సింధూ కిరణ్మయి, సిబ్బంది నామాల సురేశ్, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పుల భిక్షపతి పాల్గొన్నారు.
సంగెం మండలం పల్లార్గూడ, నల్లబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కళావతి ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం వడ్లు కొనమని చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేయి స్తున్నట్లు తెలిపారు. కార్యక్ర మంలో సంగెం సొసైటీ వైస్ చైర్మన్ కొట్టం రాజు, సర్పంచ్ లు కక్కెర్ల కుమారస్వామి, బిచ్చానాయక్, మామిడాల సు దర్శన్, ఎంపీటీసీ కట్ల సుమలత, ఏఈవో రాజేందర్, నాయకులు మేరుగు వీరేశం, వీరభద్రయ్య, కడ్దూరి నరేశ్, పొడేటి ప్రశాంత్, జలేందర్, రవీందర్, కోటి, మైమొద్దీన్ పాల్గొన్నారు.