మహబూబాబాద్ రూరల్, జూలై 31 : వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని ముత్యాలమ్మగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆట స్థలం, వంటగది, డ్రైనేజీ, కిచెన్ షెడ్, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వంట గదికి, పిల్లలు తాగేందుకు మిషన్ భగీరథ నీటిని వాడాలన్నారు. పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
స్టోర్‌రూమ్‌ను క్లీన్‌గా ఉంచాలని, బియ్యం బస్తాల కింద బల్లాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మరుగుదొడ్లు, తరగతి గదులను శుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజ నం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎర్రయ్య, ప్రత్యేక ఆడిట్ అధికారి ప్రతి భ, తహసీల్దార్ నాగభవాని, వార్డెన్ పాల్గొన్నారు.