నర్సంపేట, జూలై 31 : యువత పట్టుదలతో చదవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఆదివారం నర్సంపేటలోని ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన వి ద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు రెండు నెలల పాటు యువతకు ఫ్రీగా శిక్షణ ఇచ్చామన్నారు. 2018లో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను 1400 మంది సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు 1200 మంది ప్రతి రో జూ తరగతులకు హాజరయ్యారన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన యువతే కాకుం డా కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గూడూ రు ప్రాంతాల విద్యార్థులు హాజరయ్యారని వివరించారు.
విద్యార్థులంతా త్వరలో రాష్ట్ర ప్రభు త్వం నిర్వహించనున్న పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే, పట్టణానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లకు కూడా ఇటీవల మంజూరు చేయించామన్నారు. త్వరలో వాటిని ప్రారంభిస్తామన్నారు. నర్సంపేట ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్, నామాల సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి, భారతి, యువరాజు, రావుల సతీశ్, లీడ్ లైబ్రరీ ఫౌండర్ కాసుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ నర్సంపేటలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.
పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిందని, 8 సంవత్సరాలైనా ఇప్పటికీ చేయలేదన్నారు. కార్యక్రమంలో కల్లెపెల్లి ప్రణయదీప్మాదిగ, మిట్టపలి రాధిక, మాలతి, మునిగె యాకూబ్, గుండేటి వీరేశం, మమత, రాజన్న, ఉప్పన్న, సమ్మక్క, నర్సమ్మ, సారమ్మ, సావిత్రి, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.