హసన్‌పర్తి, జూలై 31 : యాదవులు ఐక్యంగా ఉంటూ ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. ఎర్రగట్టుగుట్ట చింతగట్టులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ సన్మా న కార్యక్రమానికి ఆదివారం వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
యాదవులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. అర్హులు త్వరగా డీడీలు చెల్లిస్తే గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మ న్లు, రాజ్యసభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. కోకాపేటలో రూ.300 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి లో రూ.5 కోట్లతో యాదవుల సంక్షేమ భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోందని వివరించారు.
అలాగే, వరంగల్‌లో కూడా భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గొల్ల, కురుమలు చాలా తెలివైనవారని వారికి వచ్చిన శాస్ర్తాలు, లెక్కలు ఎవరికీ రావన్నారు. ఎంత పెద్ద మందలోనైనా ఎవరి గొర్రెలు వారు సులభంగా గుర్తు పట్టగల సమర్థులు అన్నారు. సుందర్రాజ్ సేవలు గుర్తించి సీఎం కేసీఆర్ కుడా చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. యాదవుల సంక్షేమానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
గొల ్లకురుమలకు 4 లక్షల యూనిట్లు (84 లక్షల గొర్రెలు) రెండేళ్ల కాలంలో అందజేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఛీప్ విప్ ధాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, వాటర్ బోర్డు చైర్మన్ ప్రకాశ్, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, రైతు బంధుసమితి జిల్లా కోఆర్డినేటర్ లలితాయాదవ్, కార్పొరేటర్ రజితాయాదవ్, యాదవ సంఘం బాధ్యులు పాల్గొన్నారు.