రెబ్బెన/తాండూర్, జూలై 30: సింగరేణిలో విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు శేషజీవితాన్ని సంతోషం గా గడపాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని బీపీఏవోసీపీ2లో ఫోర్‌మెన్ మెకానిక ల్గా విధులు నిర్వహించిన టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంగెం ప్రకాశ్‌రావు, జనరల్ మజ్దూర్ అడే శంకర్ శనివారం ఉద్యోగ విరమణ పొందడంతో సింగరేణి యాజమాన్యం ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిం ది.
ఈ సందర్భంగా ఆయనను అతిథులు సన్మానించి, బెనిఫిట్స్ చెక్కులతో పాటు పింఛన్ కాపీలను అందజేశారు. సంస్థలో వా రు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, బెల్లంపల్లి ఏరి యా జీఎం దేవేందర్, ఎస్వోటూజీఎం గుప్తా, డీవైపీఎం తి రుపతి, ఇన్చార్జి మేనేజర్ మహేశ్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, కార్పొరేట్ చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్, మాజీ ఉపాధ్యక్షుడు నల్లగొండ సదాశివ్, కేంద్ర కమిటీ సభ్యుడు అబ్బు శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ లు చెన్న సోమశేఖర్, పోటు సుమలత, జడ్పీటీసీలు వేముర్ల సంతోష్, సాలిగామ బానయ్య, తాండూర్ ఎంపీపీ పూసాల ప్ర ణయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ సిరంగి శంకర్, నాయకులు తోట లక్ష్మణ్, గుంపుల విమలేశ్, మోర్ల న రేందర్, మిట్టపల్లి కుమారస్వామి, మస్కు రమేశ్, వంగ మహేం దర్, మెరుగు రమేశ్, డీ సాంబాగౌడ్, కృష్ణ, తదితరులున్నారు.
బెల్లంపల్లి ఏరియాలోని కైర్‌గూడ ఓసీపీలో 15మంది ఉద్యోగు లు శనివారం ఉద్యోగ విరమణ పొందగా, జీఎం దేవేందర్ వారి ని సన్మానించారు. అనంతరం టెర్మినల్ బెనిఫిట్స్ చెక్కులు, ప త్రాలు అందించారు. ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్, ప్రాజెక్టు ఇం జినీర్ రాజాజీ, ఇన్చార్జి మేనేజర్ మధుసూదన్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి కార్నాథం వెంకటేశం, జీఎం స్ట్ట్రక్చర్ కమిటీ మెం బర్ చంద్రశేఖర్, మారిన వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేనేజర్లు భాస్కర్, సునీల్, ఇంజినీర్లు మహేశ్, బాలయ్య, మహేశ్వర్, ఖురేషీ, వెల్ఫేర్ ఆఫీసర్ వేణు, తదితరులున్నారు.
బెల్లంపల్లి, జూలై 30: సింగరేణి కార్మికులు ఉద్యోగ విరమణ త ర్వాత వచ్చే బెనిఫిట్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని శాంతి ఖని ప్రాజెక్ట్ అధికారి కే.వెంకటేశ్వర్లు సూచించారు. మందమర్రి ఏరియా శాంతిఖనిగనికి చెందిన 14 మంది ఉద్యోగ విరమణ పొందగా, గని ఆవరణలో వారిని ఘనంగా సత్కరించారు. యాక్టింగ్ మేనేజర్ పీ రాజు, పిట్ ఇంజినీర్ బీ రాంబాబు, బోల్డర్ మైనర్ ఇన్చార్జి ముస్తఫా, సంక్షేమాధికారి టీ శ్రీని వాసరావు, టీబీజీకేఎస్ నాయకులు వెంకటరమణ, రాజనాల రమేశ్, చిలుక రాజనర్సు, శ్రీనివాసాచారి, ఆవుల రవి కిరణ్ తదితరులున్నారు.
శ్రీరాంపూర్, జూలై 30: ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ శేషజీవితాన్ని సంతోషంగా గడపాలని శ్రీరాం పూర్ జీఎం, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆయా గనులు, ఓసీ పీల్లో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఆత్మీయ వీడ్కోలు సభలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ సన్మా న సభలను నిలిపివేశారు. మరోవైపు 61 ఏండ్లకు సర్వీస్ పెంపు తో ఏడాది కాలంగా కార్మికులు రిటైర్డ్ కాలేదు. కాగా, ఈ ఏడాది విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు. వి రమణ పొందిన వారిలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ పీ దయాకర్ దంపతులను జీఎం సంజీవ రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి శాలు వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం డిపార్ట్మెంట్ల అ ధి కారులు, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి పీవీ రావు సన్మానించా రు. అనంతరం టర్మినల్ బెనిఫిట్ చెక్కులు అందించి కార్మికుడు సంస్థకు చేసిన సేవలు కొనియాడారు. ఎస్వోటూజీఎం త్యాగ రాజు, ఏజీఎం మురళీధర్, డీవైజీఎం అరవిందరావు, ఎస్ఈ చంద్రశేఖర్, పీఎం రాజేశ్వర్‌రావు, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.
ఎస్సార్పీ 3గనిలో ఉద్యోగ విరమణ పొందుతున్న 10 మం ది కార్మికులను మేనేజర్ సంతోష్ కుమార్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, పిట్ కార్యదర్శి ఆర్ గోపాల్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. సేఫ్టీ అధికారి మహేందర్, ఈఈ ప్రేంకుమార్, సీనియర్ పీవో మోహన్‌సింగ్ పాల్గొన్నారు.
ఆర్కే7గనిపై ఉద్యోగ విరమణ పొందిన 8 మంది కార్మికుల ను గని మేనేజర్ సాయిప్రసాద్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి మెండ వెంకటి ఘనంగా సత్కరించారు. అనంతరం తోటి కా ర్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు సన్మానించి వీడ్కో లు పలికారు. సేఫ్టీ ఆఫీసర్ రవిశంకర్, డిప్యూటీ మేనేజర్ రాం దాస్, నాయకులు ప్రేమ్‌కుమార్, రాజునాయక్ పాల్గొన్నారు.
ఆర్కే న్యూటెక్ గనిలో ఉద్యోగ విరమణ పొందిన కారుకూరి రాయలింగు, మూట భీమయ్య, గాదం లక్షణ్, ఏసురత్నం, ఏ పోషం, డీ సమ్మయ్య, దూట మల్లేశ్, వరాల లక్షయ్యను గ ని మేనేజర్ స్వామిరాజు, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి బుస్స రమేశ్ ఘనంగా సన్మానించారు. సేఫ్టీ ఆఫీసర్ అజయ్ కుమార్, సీనియర్ పీవో సృజన్ స్టాన్లీజోన్స్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ ఓసీపీలో కోట రాజయ్యగౌడ్, కే శేఖర్, కటకం సమ్మయ్య, ఎర్రం చంద్రయ్య, మేసినేని సంపత్‌రావు, చేపూరి సత్తయ్య, పెరుక సత్తయ్య, మాదిరెడ్డి బుచ్చిరెడ్డి, చిలుక యుగేంధర్ ఉద్యోగ విరమణ పొందుతుండగా, వారిని ప్రాజె క్ట్ ఆఫీసర్ పురుషోత్తంరెడ్డి, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు అన్నయ్య, మంద మల్లారెడ్డి, పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్ శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. మేనేజర్ జనార్దన్, ఈఈ చంద్రశేఖర్, శ్యాంసుందర్‌రావు, సీనియర్ పీ వో బీ శంకర్ పాల్గొన్నారు.
ఆర్కే 5గనిలో ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికులు ఇ ప్ప శంకర్, శ్రీరాముల ప్రభాకర్, చిన్నన్న, మేకల కొమురయ్య, పేర్ని రామయ్య, అలువాల లింగయ్యను మేనేజర్ అబ్దుల్ ఖా ధీర్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, పిట్ కార్యదర్శి ఆర్ మహేందర్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం వారికి బెనిఫిట్ చెక్కులు అందించి, వారి సేవలు కొనియాడారు. సేఫ్టీ ఆఫీసర్ శివయ్య, సీనియర్ పీవో రణదీప్, అసిస్టెంట్ మేనేజర్ రాందాస్, ఈఈ రాధాకృష్ణ పాల్గొన్నారు.
మందమర్రి రూరల్, జూలై 30: ఏరియాలోని పలు గను లు, డిపార్టుమెంట్లలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు వారి కుటుంబ సభ్యులను సింగరేణి అధి కారులు ఘనంగా సన్మానించారు. బెన్ఫిట్స్ చెక్కులను అంద జేశారు. కేకే 5 గనిలో 12 మంది ఉద్యోగులు విరమణ పొంద గా, వారిని ఆ గని మేనేజర్ భూ శంకర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రక్షణాధికారి శ్రీకాంత్, అసిస్టెంట్ మేనేజర్ జశ్వంత్, కార్యాలయ సూపరింటెండెంట్ బచ్చయ్య, టీబీజీకే ఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, పిట్ కార్యదర్శు లు, కార్మికులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్ జూలై 30: మందమర్రి ఏరియాలోని ఆర్కే 1ఏ, ఆర్కేపీ సీహెచ్‌పీలలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొం దిన కార్మికులను ఆయా గనుల అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు శనివారం ఘనంగా సన్మానించారు. ఆర్కే 1ఏ గని ట్రామర్ నేరేటి యాదగిరి దంపతులను గని ఇన్చార్జి మేనేజర్ జయంత్‌కుమార్, ఆర్కేపీ సీహెచ్‌పీలో పని చేసిన మహిళా కార్మికురాలు ఆవుదారి పోసును సీహెచ్‌పీ డీజీ ఎం బాలాజీ భగవతిఝా సన్మానించి, జ్ఞాపికలను అందజేశా రు. ఆర్కే 1ఏ గని డిఫ్యూటీ మేనేజర్ వెంకటేశ్, సర్వే అధికారి నజీరొద్దీన్, టీబీజీకేఎస్ నాయకుడు బండారి భిక్షపతి, ఏఐటీ యూసీ పిట్ కార్యదర్శి వినయ్‌కుమార్, సీనియర్ పర్సనల్ అధి కారి కార్తిక్, సీహెచ్‌పీ డీవైఎస్ఈ చంద్రమౌళి, పిట్ కార్యద ర్శు లు జే.శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, జూలై 30 : కాసిపేట 1వ గని, 2 ఇైంక్లెన్ గనులపై శ నివారం విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించా రు. కాసిపేట 1వ గనిలో 14 మంది, 2 ఇైంక్లెన్ ఒక కార్మికుడు ఉద్యోగ విరమణ పొందగా వారికి శాలువాలతో పూలమాలల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గని అధికారు లు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు