పలిమెల, జూలై 30: సంఘ విద్రోహ శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌పటేల్ అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్‌లో భాగంగా మండలంలోని ముకునూరు గ్రామ శివారులో ఉంటున్న గొత్తికోయగూడెంలో సోదాలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను విచారిం చి వదిలేశారు. అనంతరం గొత్తికోయలకు బెడ్షీట్లు, పం డ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ.. సీపీఐ మావోయిస్టు వారోత్సవాలు ఉన్నందున ప్రజ లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులు గూడెంలోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారికి సహకరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మహదేవపూర్ సీఐ కిరణ్, పలిమెల ఎస్సై అరుణ్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
రేగొండ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహద పడుతాయని ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా స్థానిక పోలీసులు మేము సైతం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై శ్రీకారం చూట్టారు. కెమెరాల ఏర్పాటు కోసం మొదట రూ. 2 వేల విరాళం అందచేశారు. గ్రామస్తులు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు కెమెరాల ఏర్పాటు కమిటీని ఏర్పాటు చేశారు. మడుతపల్లి, కొడవటంచ గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నేర రహిత మండలంగా ఏర్పాటు చేయడమే లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రంజిత్, పబ్బ శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మల్హర్ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని మల్లంపల్లి గ్రామంలో శనివారం 40 మంది డిస్ట్రిక్ స్పెషల్ పార్టీ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100ను వినియోగించుకోవాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, ఏటీఎం కార్డు నంబర్ అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజలు సహకరించాలని కోరారు. అదేవిధంగా గ్రామ కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. కొండంపేటలో సర్పంచ్ కుమారస్వామి, గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు అమర్చినట్లు ఎస్సై వివరించారు. కార్యక్రమంలో కొయ్యూర్ ఎస్సై-2 ప్రశాంత్ పాల్గొన్నారు.
కాటారం : శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని కాటారం సీఐ రంజిత్‌రావు, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోమల్ ప్రీతికౌర్ అన్నారు. మండలంలోని అంకుషాపూర్ జీపీ పరిధిలోని దస్తగిరిపల్లిలో శనివారం పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఎస్సైలు చంద్రగిరి శ్రీనివాస్, దాసరి సుధాకర్ సిబ్బందితో కలిసి ఇంటింటా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ, సీఆర్పీఎఫ్ ఏసీ మాట్లాడుతూ యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సన్మార్గంలో ముందుకెళ్లాలన్నారు. అనంతరం గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు అన్నె సంతోష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.