కురవి, జూలై 30 : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శా ఖల మంత్రి సత్యవతిరాథోడ్ తల్లి గుగులోత్ దస్మాకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. గ్రామస్తులు, రాజకీయ ప్రముఖులు వెంట రాగా, శనివారం ఆమె సొంతూరు కురవి మండలం పెద్దతండాలోని వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మె ల్యే బానోత్ శంకర్‌నాయక్ మృతదేహం వద్ద నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పాడె మోశారు. కాగా, ఆరునెలలు గడువకముం దే తల్లిదండ్రులను కోల్పోయి పుట్టె డు దుఃఖంలో ఉన్న మంత్రి సత్యవతిరాథోడ్, కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి ఓదార్చారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, జడ్పీచైర్‌పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు దస్మా మృతదేహం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
బోరున విలపిస్తున్న మంత్రి సత్యవతిని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఫోన్ ద్వారా మంత్రి సత్యవతిని పరామర్శించారు. కలెకర్ శశాంక, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అడిషనల్ ఎస్పీ యోగేశ్‌గౌతమ్ దస్మా మృతదేహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు.
టీఆర్ఎస్ పార్లమెంట్ సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్రావు, రాజ్యసభ సభ్యులు పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పెద్దతండాలో మంత్రి సత్యవతిరాథోడ్‌ను పరామర్శించారు. దస్మా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. పరామర్శించిన వారిలో ఎమ్మె ల్సీ తాత మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భద్రా ద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఇల్లందు మార్కెట్ చైర్మన్ హరిసింగ్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.