సంగెం, జూలై 30 : తెలంగాణ ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా పోసిన చేపపిల్లలు మత్య్సకారులకు సంపద సృష్టిస్తున్నాయి. మండలంలోని ఎల్గూర్ చెరువులో మత్స్యకారులకు పెద్ద చేప చిక్కింది. ముమ్మిడివరం గ్రామానికి చెందిన ప్రశాంత్, ప్రమోద్ శనివారం చెరువులో చేపల వేటకు వెళ్లారు. వారి వలలో పదిన్నర కిలోల వాలుగ చేప చిక్కింది. దీంతో పలువురు చేపను ఆసక్తిగా తిలకించడంతో పాటు ఫొటోలు దిగారు.