మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వరంగల్ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. ఈ పథకాన్ని ఎత్తివేసి కూలీల పొట్టగొట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నదని ఆరోపించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన మంగళవారం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఉపాధి కూలీల పని విధానాన్ని ప్రశ్నించేలా, వారిని అవహేళన చేసేలా కేంద్రం జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని సభ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు, పేదల ఉపాధిని దూరం చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కాగా, అధికారుల పని తీరు సరిగా లేదని సభ్యులు నిరసన తెలిపారు.
వరంగల్, జూలై26(నమస్తేతెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర పన్ను తోందని వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమా వేశంలో సభ్యులు మండిపడ్డారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నర్సంపే ట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నతో పాటు జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, అన్ని ప్రభు త్వ శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై సభ్యులు ఫైర్ అయ్యారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అ మల్లో పని దినాలు ఎక్కువగా నమోదయ్యేది తెలంగా ణలో మాత్రమేనని, తద్వారా రాష్ట్రంలో అభివృద్ధి జరు గుతున్నదని, కూలీలకు చేతి నిండా పని దొరుకుతున్న దని అన్నారు. ఇది చూసి తట్టుకోలేకపోతున్న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం గత మే 5వ తేదీన ఉపాధి హా మీ అమలుపై కొత్తగా ఒక సర్క్యులర్ జారీ చేసిందని, ఈ పథకాన్ని తుంగలో తొక్కేందుకే దాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. పొట్టకూటి కోసం కూలీలు కష్టపడి పని దినాలను నమోదు చేసుకుంటుంటే చాటుమార్గంలో ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తోం దని ఆయన ధ్వజమెత్తారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికలు, రైతు కల్లాలు నిర్మిస్తే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని, బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం పని ప్రదే శంలో ప్రతి రోజు ఉదయం 11 గంటల్లోపు ఒకసారి, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల్లోపు మరోసారి వేర్వేరుగా కూలీల లైవ్ ఫోటోలు తీసి యాప్‌లో అప్ లోడ్ చేయాలని కేంద్రం కొత్తగా జారీ చేసిన సర్క్యుల ర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రజాప్రతి నిధులపై ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ నిధుల తో గ్రామాల్లో స్మశానవాటికలు, రహదారులు, ఇంకు డు గుంతలు నిర్మించుకుంటే కూడా కేంద్రం తప్పుప డుతున్నదని అన్నారు.
ఎన్నికల్లో గ్రామ పంచాయతీ వార్డుసభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీ పీ, ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారి మొబైల్ నెంబర్లతో వాట్సాప్ గ్రూపులను ఎస్టాబ్లిష్ చేసి వాటిలో ఉపాధి హామీ పనులు చేసే కూలీల వివరాల ను పెట్టాలని ఢిల్లీ నుంచి అధికారులకు ఆదేశాలు కూ డా వచ్చాయని ఎమ్మెల్యే పెద్ది తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇన్నాళ్లు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ మార్కెట్లు, అప్పులపై కుట్రలు చేసిన కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు ఉపాధి హామీపై కన్నే సిందని ఫైర్ అయ్యారు. ఈ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేయాలని వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, వైస్ చైర్మన్ ఏ శ్రీనివాస్ ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు.
సభ్యులందరూ ఏకగ్రీ వంగా ఆమోదించిన దృష్ట్యా ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్ర భుత్వానికి పంపనున్నట్లు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలుపై కేంద్రం అనుసరిస్తున్న తీరును పరిశీలిస్తే కుట్రగానే కనపడుతోందని, రాష్ట్రం పట్ల మొదటి నుంచి వివక్ష కనబరుస్తున్నదని ఆమె పేర్కొన్నారు. గత బడ్జెట్లో నూ ఈ పథకానికి నిధుల కేటాయింపుల్లో కోత పె ట్టిందని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నార్మల్ డెలివరీల కోసం చర్యలు తీసుకోవడం లేదన్నారు. పరకాలలోని సీహెచ్ సీలోనూ ప్రజలకు ఆశించిన వైద్య సేవలు అందడం లేదని ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ మొగిలి పేర్కొన్నా రు.
చెన్నారావుపేట పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవ లను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదనను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారని ఎంపీపీ విజేందర్ ఆరోపించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం పనులకు సంబంధించి విద్యా శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇ వ్వడం లేదని నిరసన వెలిబుచ్చారు. శాయంపేట మండలంలోని ప్రజా సమస్యలపై పంచాయతీ, విద్యా శాఖ అధికారులు స్పందించడం లేదని ఎంపీపీ తిరుప తిరెడ్డి అన్నారు.
ఆ అధికారుల పనితీరుపై జడ్పీ చైర్ప ర్సన్ కూడా నిరసన తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకడిపోల డీలర్ల స్థానాలను భర్తీ చేయాలని జడ్పీటీసీ లు, ఎంపీపీలు కోరారు. డీలర్ల నియామకానికి నోటిఫి కేషన్ ఇవ్వాలని మూడేళ్ల నుంచి కోరుతున్నట్లు పరకా ల జడ్పీటీసీ మొగిలి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు హరిసింగ్, సంధ్యారాణి, జడ్పీ సీఈవో రాజా రావు, డీఆర్డీవో సంపత్ రావు, డీఏవో ఉషాదయాళ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీసీవో సంజీవరెడ్డి, డీపీ వో స్వరూప, డీఈవో వాసంతి పాల్గొన్నారు.