హనుమకొండ చౌరస్తా, జూన్ 30 : రుమటాయిడ్ ఆర్థరైటిస్ వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా రావొచ్చని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని ప్రముఖ రుమటాలజీ డాక్టర్ వీ సునీల్ అన్నారు. హనుమకొండ కంచరకుంట సమీపంలోని శ్రీఏషియన్ రుమటాలజీలో వైద్యసేవలందిస్తున్న ఆయన రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు, చికిత్స గురించి వివరించారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులకు సంబంధించిన వ్యాధి. దీనికి చికిత్సనందిస్తున్నది నూతన సూపర్ స్పెషలైజేషన్ విభాగం. రుమటాలజీ డాక్టర్ను రుమటాలజిస్ట్ అంటారు. కీళ్లను నిర్వీర్యం చేసే ఆటో ఇమ్యూన్ చర్య. (మన శరీరంలోని రోగనిరోధక కణాలకు తప్పుడు సంకేతాలు అందడం వలన మన శరీర కణాలే మన అవయవాలను, కీళ్లు, కండరాలను దెబ్బతీసి నిర్వీర్యం చేసే చర్య).
కీళ్ల నొప్పులు, వాపులు, బిగపట్టినట్టు ఉండి కదలికలు లేకపోవడం, ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉండడం. మిగితా నొప్పులు విశ్రాంతి సమయంలో తక్కువగా ఉంటాయి. కానీ, ఈ వ్యాధిలో మాత్రం అందుకు వ్యతిరేకంగా విశ్రాంతి సమయంలోనే నొప్పులు ఎక్కువగా ఉంటాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటెక్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఎస్ఎల్ఈ, షాగ్రెన్స్, వ్యాస్కులైటిస్ మొదలైనవి ఈ వ్యాధి సమస్యలు. న్యూరో, ఆర్థోపెడిక్ సమస్యల ద్వారా సరైన చికిత్స అందక, వ్యాధి తీవ్రత పెరగడమే కాకుండా, అమూల్యమైన కాలాన్ని కోల్పోతారు. వృద్ధుల్లోనే ఈ వ్యాధులు వస్తాయని, రుమటాలజీ డాక్టర్లు రాసే ఇంగ్లిష్ మందుల ద్వారా ‘సైడ్ ఎఫెక్ట్స్’ ఉంటాయని, ఆపరేషన్ మాత్రమే కీళ్ల అరుగుదలకు పరిష్కారమనేది అపోహ మాత్రమే..
రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడినవారికి వ్యాధి పూర్తిగా తగ్గడమేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిర్ధారణ అయ్యింది. ప్రాథమిక దశలోనే చికిత్స మొదలుపెడితే ఆపరేషన్ల బారిన పడరు. క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదించడం, ప్రతిరోజు వ్యాయామం. సరైన ఆహార నియమాలు.. ఇవి చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చు.
– డాక్టర్ వీ సునీల్, ఎండీ, ఫెలో ఇన్ రుమటాలజీ-బీవీడీయూ(పుణె), ఎక్స్-ఫ్యాకల్టీ రుమటాలజీ అండ్ ఇమ్యుమోలజీ-బీవీడీయూ(పుణె), శ్రీఏషియన్ రుమటాలజీ, కంచరకుంట (శ్రీదేవి ఏషియన్మాల్ రోడ్డు), హనుమకొండ