యోగా సాధన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిన్నా, పెద్దా అంతా కలిసి ఉత్సాహంగా ఆసనాలు వేస్తూ కనిపించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, క్రీడా మైదానాల్లో, ఇతర ప్రదేశాల్లో యోగా గురువులు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో ఆసనాలు వేయించారు. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో యోగా డే ను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ‘మానవత్వం కోసం యోగా’ థీమ్‌తో కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయాచోట్ల కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, భవేశ్‌మిశ్రా, గోపి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని ఆసనాలు వేశారు.
– నమస్తే నెట్వర్క్