మడికొండ, జూన్ 4 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర దేశానికే అదర్శంగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 46వ డివిజన్ మడికొండలోని వాసవీ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్ శనివారం 53 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, 13 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4 లక్షల 50వేల 500 విలువచేసే చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో సర్కారు సాయం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమలో కార్పొరేటర్లు మునిగాల సరోజన, ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ శ్రీలేఖ, రామ్మూర్తి, డివిజన్ అధ్యక్షుడు వినోద్‌కుమార్, సోషల్ మీడియా ఇన్చార్జి భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.