జనగామ చౌరస్తా, జూన్ 4 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం జనగామలోని 30 వార్డుల్లో కౌన్సిలర్లు, వార్డు స్పెషల్ ఆఫీసర్లు పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి పరిష్కరించారు. తడి, పొడి చెత్తపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. 1వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ రామగల్ల అరుణ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్కు శుభ్రం చేయడంతో పాటు బీసీ హాస్టల్ పక్కన పాత బావిని పూడ్చారు.
రాజీవ్ నగర్ ఏరియాలో రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి చెట్లను తొలగించారు. 2వ వార్డులో వాంకుడోత్ అనిత, 3వ వార్డులో పగిడిపాటి సుధ సుగుణాకర్‌రాజు, 4వ వార్డు మంత్రి సుమలత, 5వ వార్డు దేవరాయ నాగరాజు, 6వ వార్డు వంగాల కల్యాణి, 7వ వార్డు ఎం అరవింద్‌రెడ్డి, 8వ వార్డు తాళ్ల సురేశ్‌రెడ్డి, 9వ వార్డు ముస్త్యాల చందర్, 10వ వార్డు ఎన్ లక్ష్మి, 11వ వార్డు పాక రమ, 12వ వార్డు గుర్రం భూలక్ష్మి, 13వ వార్డు మల్లిగారి చంద్రకళ, 14వ వార్డు పేర్ని స్వరూప, 15వ వార్డు మారబోయిన పాండు, 16వ వార్డు గాదెపాక రాంచందర్, 17వ వార్డు జక్కుల అనిత, 18వ వార్డు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, 20వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ జూకంటి లక్ష్మి శ్రీశైలం, 21వ వార్డు కర్రె శ్రీనివాస్, 22వ వార్డు బాల్దె కమలమ్మ, 23వ వార్డు వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, 24వ వార్డు గంగరబోయిన మల్లేశ్, 25వ వార్డు ఊడ్గుల శ్రీలత, 26వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున లింగయ్య, 27వ వార్డు హరిశ్చంద్రగుప్తా, 28వ వార్డు ఎండీ సమద్, 29వ వార్డు ముస్త్యాల దయాకర్, 30వ వార్డు బొట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు స్పెషల్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్లు ఏ రవి, వార్డు ఆఫీసర్ కే కృష్ణవాసు, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.
జనగామ పట్టణంలో శనివారం జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పర్యటించారు. ధర్మకంచ మినీ స్టేడియం, 13వ వార్డు అర్బన్ హెల్త్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్ ఏరియాలో కలెక్టర్ శివలింగయ్య కలియతిరిగారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ధర్మకంచ ఏరియాలో ఉన్న వైకుంఠధామాన్ని పరిశీలించి మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతిఒక వార్డులో నెలకొని ఉన్న సమస్యల్నీ గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, మున్సిపల్ కమిషనర్ నోముల రవిందర్, కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ రాజు, వార్డు స్పెషల్ ఆఫీసర్ అనిరుద్, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పానుగంటి రాహేల పాల్గొన్నారు.