బయ్యారం, జూన్ 4 : పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములవ్వాలని జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు సూచించారు. శనివారం రెండో రోజూ పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ముస్తాఫానగర్‌లో పాతయాత్ర చేశారు. వీధుల్లోని చెత్త, మురుగు నీరు తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతిబాట పట్టాయన్నారు. పల్లెలో పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటమ్మ, సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, ఎంపీడీవో చలపతిరావు, ఉప సర్పంచ్ కవిత, సెక్రటరీ మమత, నాయకులు వెంకటపతి, కిరణ్, సుమన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు, జూన్ 4: పట్టణ ప్రగతితో మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అన్నారు. శనివారం డివిజన్ కేంద్రంలోని 15, 12వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చడం, ఫార్మషన్ రోడ్లు చేయడం, పారిశుధ్య పనులు, సైడ్ డ్రైనేజీ, పిచి మొక్కలను తొలగించడం, 15వ వార్డులోని బస్టాండ్ పరిసరాల్లోని చెత్తచెదారాన్ని తొలించే పనులను పట్టణ ప్రగతి స్టేట్ పరిశీలకుడు శ్రీధర్, కమిషనర్ గుండె బాబు, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డితో కలిపి పరిశీలించారు. ఈ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసీఆర్ పట్టణ ప్రతిగలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలకు పెద్దపీట వేసిందన్నారు. అదే విధంగా హరితహారం కార్యక్రమంలో లక్షలాది మొక్కలను నాటి పచ్చదాము పెరిగేలా వర్షాలు సకాలంలో పడేలా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుగులోత్ శంకర్, ఎన్నమనేని శ్రీనివాసరావు, ఏఈ రంజిత్, ఆర్టీసీ డీఎం రమేశ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, ప్రత్యేకాధికారులు రాకేశ్, రంజిత్, వార్డు స్పెషల్ ఆఫీసర్ యాకయ్య, అనంతలక్ష్మి, కాంట్రాక్టర్ గుంజి రవి, వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తొర్రూరు: పల్లెల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నా మని ఎంపీపీ, జడ్పీఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని సోమారపుకుంటా తండా గ్రామ పంచాయతీలో 5వ విడుత పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిషత్ నిధుల ద్వారా రూ.4లక్షల నిధులతో సైడ్ కాల్వల నిర్మాణ పనులకు సర్పంచ్ బానో తు యాకమ్మ కిషన్‌నాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో గ్రామ పంచాయతీ భవనం, వైకుంఠధామం, అంతర్గత సీసీ రోడ్లు మొదలగు పనులతో మండలంలోనే అభివృద్ధిలో ముందు వరసలో ఉంద న్నారు.ఉప సర్పంచ్ వెంకన్న, వార్డు సభ్యులు నీలమ్మ రవి, రెడ్యా, శ్రీను, మాజీ వార్డు సభ్యులు యాకమ్మ, శ్రీను, సర్రాము, మగ్యా, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవంగర, జూన్ 4 : పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఎంపీపీ రాజేశ్వరి సూచించారు. శనివారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఐదో విడుత పల్లెప్రగతి పనులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. మండలంలోని గంట్లకుంటలో పల్లె ప్రగతి పనుల నిర్వహణను సర్పంచ్ చింతల భాస్కర్‌రావుతో కలిసి ఆమె పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులను గ్రామాల్లో అభివృద్ధి పనులకు సక్రమంగా వినియోగించాలన్నారు. గ్రామ సభల్లో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి పనులను చేపట్టాలని సూచించారు. ఎంపీటీసీ అనురాధ, గ్రామ రైతు బందు కన్వీనర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అశోక్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
మరిపెడ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధి కాంక్షిస్తూ పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగిస్తుందని ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, ఎంపీడీవో కేలోత్ ధన్సింగ్ అన్నారు. మండలంలోని ఎర్జర్ల, లచ్చతండా, గుర్రపు తండా, తండాధర్మారం, బాల్నిధర్మారం తదితర పంచాయతీల్లో వారు ప్రగతి పనులు పరిశీలన చేశారు.అంగన్వాడీ, పశు వైద్యాశాలలు, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించి, విధుల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్యం పాటించి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తడి, పొడి వ్యర్థాల సేకరణకు జీపీలు ముమ్మరంగా పని చేయడం మూలాన పల్లెల్లో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నర్సింహులపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. శనివారం గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
డోర్నకల్: 5వ విడత పల్లె ప్రగతి పనులు 30 జీపీలో ్ల శనివారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో రోజూ రోడ్లకు ఇరువైపులా చెత్త చెదారం తొలిగించి, డ్రైనేజీలు శుభ్రం శానిటేషన్ చేశారు. పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో అపర్ణ పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు పరిశీలించారు.
గార్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 5వ విడుత పల్లెప్రగతి విజయవంతం చేయాలని డీఎల్పీవో గంగా భవాని సూచించారు. శనివారం గార్ల మేజర్ పంచాయతీలో పల్లెప్రగతిలో భాగంగా హై స్కూల్, పోలీసుస్టేషన్ వద్ద పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, ఎంపీడీవో రవీందర్, ప్రత్యేక అధికారి కే రామారావు, కార్యదర్శి కుమార స్వామి పాల్గొన్నారు.