బయ్యారం. జూన్ 4: ‘మల్లన్న.. ఎల్లన్న.. జ ర ఆగుండ్రె.. పిల్లల్ని పట్టుకొని యాడికి పోతుం డ్రె.. మన సర్కారు బడిలోనే ఇంగ్లిష్ మీడియం స్టాట్ అయింది’ అంటూ సాగే విద్యాశాఖ రూపొందించిన పాటకు వీడియో చిత్రీకరించి ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రాం వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బడిబాట కార్యక్రమానికి వినూత్న ప్రచారం కల్పిస్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు.. బయ్యారం మండ ల కేంద్రానికి చెందిన కళాకారుడు, గాయకుడు వీరబోయిన వీరన్న వెంకట్రాపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
బడిబాట జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు, సౌకర్యాలతో పాటు ఇంగ్లీష్ మీడి యం విద్య అందుబాటులో ఉన్న తరుణంలో సర్కారు పాఠశాలల్లో చేర్చాలని చిన్నారుల తల్లితండ్రులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ వీడియోను పలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడంతో బాడిబాటపై ప్రచారం జోరుగా సాగుతున్నది. దీంతో ఉపాధ్యాయుడు వీరన్న చేస్తున్న ప్రచార ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.