గీసుకొండ : కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సామర్ధ్యాల సర్వేలో భాగంగా గీసుకొండ మండలంలో నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను డీఈవో వాసంతి శుక్రవారం పరిశీలించారు. ధర్మారం, గంగదేవి పల్లిలోని పాఠశాలలను సందర్శించి, పరీక్షా విధి విధానాలను పరిశీలించారు. పరీక్షా నిర్వహణ తీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 3,5 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు గణితం, తెలుగు, సైన్సు, సాంఘిక శాస్త్రం, పదో తరగతి విద్యార్థులకు తెలుగు, గణితం, సైన్సు, సాంఘికశాస్త్రం, ఆంగ్లం సంబంధించిన పరీక్షలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయురాలు సుజాత, అబ్జర్వర్ పద్మజ తెలిపారు.