వరంగల్ డీసీసీబీ నంబర్ వన్ కావాలి
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి బుధవారం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు
- బ్యాంకులో ‘దళిత బంధు’ జమ చేయడానికి కృషి
- కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సమృద్ధిగా నీరు
- డీసీసీబీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- పాల్గొన్న చీఫ్ విప్ దాస్యం, ఎమ్మెల్యేలు అరూరి, పెద్ది
వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి బుధవారం డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గతంలో తాను చైర్మన్‌గా ఉన్నప్పుడు బ్యాంకు అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కృషిచేశానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో సమృద్ధిగా నీటితోపాటు నిరంతర కరంట్, పంట పెట్టుబడి సాయంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారాయని వివరించారు. పాలకవర్గం, ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి బ్యాంకు గౌరవాన్ని పెంచి, రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, లాభాల బాటలోకి తీసుకొచ్చారని మంత్రి అభినందించారు.
సుబేదారి, జనవరి 4 : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రాష్ట్రంలో నంబర్ కావాలి, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. డీసీసీబీ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యతన బుధవారం హనుమకొండలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరుకాగా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. గతంలో తాను బ్యాంకు చైర్మన్‌గా పనిచేసినందున బ్యాంకుపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. బ్యాంకు అభివృద్ధి కోసం, రైతులకు మెరుగైన సేవలు అందిచేందుకు నిజాయితీతో పనిచేశామని చెప్పారు.
అప్పట్లో జడ్పీ చైర్మన్ కావాలనుకున్నా.. కానీ, కుల సమీకరణతో డీసీసీబీ చైర్మన్‌గా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అవకాశం కల్పించారని మంత్రి గుర్తు చేశారు. డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసినప్పుడు ప్రొటోకాల్ లేదు, జడ్పీటీసీల వెనుక కూర్చునేది అని అన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి, రెండు జిల్లాల బ్యాంకులు రికవరీలో ముందు ఉండేవని, వాటిని చూసి చాలా బాధపడేదని చెప్పారు. అప్పటి పరిస్థితులు వేరు.. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు లేవు.. కరంట్ లేదు.. పంటలు పండకపోవడంతో రైతులు బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు పడేది.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి గర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులతో సమృద్ధిగా నీటితోపాటు నిరంతర కరంట్, పంట పెట్టుబడి సాయంతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం రంగం రూపురేఖలు మారాయని వివరించారు.
రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తిరిగి సకాలంలో చెల్లిస్తున్నారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పనిచేసినవారు తప్పులు చేశారు, రాజకీయంగా బ్యాంకును ఉపయోగించుకున్నారు, ఇప్పుడున్న రవీందర్రావు పాలక వర్గం బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసిందని కొనియాడారు. పాలకవర్గం, ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి బ్యాంకు గౌరవాన్ని పెంచి, రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ, లాభాల బాటల్లోకి తీసుకొచ్చారని అభినందించారు. అన్ని రకాల రుణాలు ఇస్తూ, రూ.437 కోట్ల డిపాజిట్లు పెంచి బ్యాంకును లాభాల బాటలో నడిపిస్తూ, అనేక అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పీఏసీఎస్ చైర్మన్లకు గౌరవ వేతనం ఇవ్వాలని తనతోపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో సీఎం స్పందించి ఒప్పుకున్నారని మంత్రి చెప్పారు. దళిత బంధు మొత్తం బ్యాంకులో జమచేయడానికి కృషిచేస్తానని ఎర్రబెల్లి అన్నారు.
డీసీసీబీకి ఘన చరిత్ర : చీఫ్‌విప్ దాస్యం
వరంగల్ డీసీసీబీకి అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. డీసీసీబీకి ఘనమైన చరిత్ర ఉంది, రవీందర్రావు పాలక వర్గం బ్యాంకు పురోగతికి కృషిచేసిందని అభినందించారు. నగరంలో సంఘటిత, అసంఘటిత కార్మికులను ఏకం చేసి 60 సంఘాలను ఏర్పాటు చేశాం, ఈ సంఘాల్లో ఉన్న కార్మికులకు డీసీసీబీ నుంచి రుణాలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయాలని వినయ్‌భాస్కర్ పాలక వర్గానికి సూచించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ రవీందర్రావు పాలకవర్గం అనతికాలంలో బ్యాంకును ఎంతో అభివృద్ధి చేసింది, లాభాల బాటతోపాటు అవార్డుల పంట పండిస్తున్న బ్యాంకు పాలకవర్గానికి తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ తమ పాలకవర్గం రాకముందు రూ.559 కోట్ల రుణాలు ఉండేవి, ఇప్పుడు రూ.1,193 కోట్లకు తీసుకొచ్చాం, లోనింగ్, రికవరీలో జాతీయ స్థాయిలో బెస్ట్ గ్రోతింగ్ అవార్డు అందుకున్నామని అన్నారు. రైతులు, చిరువ్యాపారులు, మహిళలు, విద్యార్థులు, గృహాలకు రుణాలు ఇస్తూ బ్యాంకును బలోపేతం చేస్తున్నామని చెప్పారు. లోనింగ్, రికవరీలో 9వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వచ్చామని, కొత్తగా 8 శాఖలను ఏర్పాటు చేసుకొని అవసరం ఉన్న ప్రతి రైతుకు రుణం ఇస్తున్నామని చైర్మన్ వివరించారు. కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్లు, బ్యాంకు సీఈవో చిన్నారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

