ఎమ్మెల్యే అరూరి రమేశ్
ఐనవోలు, మే 16: వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ వైద్యులకు సూచించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్సీ పరిధిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ర్యాపిడ్, హోంఐసొలేషన్ కిట్ల సంఖ్యను పెంచాలని వైద్యాధికారి సుష్మ, 24గంటల వైద్యసేవలు ప్రారంభించాలని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మధుమతి ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి డీఎంహెచ్‌వోతో ఫోన్లో మాట్లాడారు. ఐనవో లు పీహెచ్సీలో 24 గంటల సేవలు ప్రా రంభించాలని, వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పీహెచ్సీలో ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్‌తో సమీక్షించి అమలు జరిగే విధంగా కృషి చేస్తానన్నారు. ఆయన వెంటన జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, ఆలయ కమిటీ చైర్మన్ ము నిగాల సంపత్‌కుమార్, సర్పంచ్ కుమారస్వామి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్, ఉపసర్పంచ్ సతీశ్, నాయకులు రవీందర్, పరమేశ్, వెంకన్న పాల్గొన్నారు.