warangal : దసరా ఉత్సవాలకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

కరీమాబాద్ : ఉర్సు రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉర్సు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల ఆల్బమ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేపట్టేలా అధికారులతో మాట్లాడతానన్నారు. అవసరమైతే ఉర్సు రంగలీల మైదానంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపడుతానని తెలిపారు.
ఉత్సవాల విజయవంతానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. పలు విషయాలను ఉత్సవ కమిటీ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో దసరా కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి, కోశాధికారి మండ వెంకన్నగౌడ్, ఉత్సవ కన్వీనర్ నరేందర్ ఉపాధ్యక్షుడు మేడిది మధుసూదన్, శివమూర్తి, కార్యదర్శులు గోనె రాంప్రసాద్, సమ్మయ్య, కార్యదర్శులు బజ్జూరి వాసు, బొల్లం రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

