నమస్తే నెట్వర్క్: వర్ధన్నపేట మండలంలో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమేశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తహసీల్ కార్యాలయంలో ఎన్నికల నయాబ్ తాసిల్దార్ హారతి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గొల్ల రమేశ్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గొడిశాల రవీందర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, కౌన్సిలర్లు సత్కరించి దుస్తులు పంపిణీ చేశారు. అలాగే, ల్యాబర్తిలో సర్పంచ్ పస్తం రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఉపసర్పంచ్ పిన్నింటి కళింగరావు, వార్డు సభ్యులు పారిశుధ్య కార్మికులను సన్మానించి దుస్తులు అందించారు.
నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ వాసం రామ్మూర్తి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ఆదర్శ మండల సమాఖ్యలో ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, లక్నేపల్లి బిట్స్ కళాశాలలో చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్‌రెడ్డి, భాంజీపేట పీహెచ్సీలో వైద్యాధికారి భూపేశ్, పశువైద్యశాలలో వెటర్నరీ అధికారి శ్రీధర్‌రావు, నర్సంపేట, గురిజాల పీఏసీఎస్‌ల్లో చైర్మన్లు మోహన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్ త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. చెన్నారావుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లలిత, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై తోట మహేందర్, తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ బన్సీలాల్నాయక్, చెన్నారావుపేట సొసైటీలో డైరెక్టర్ జంగిలి బాబు, టీఆర్ఎస్ కార్యాలయంలో మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, చెన్నారావుపేట జీపీలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, రైతు వేదికలో ఏవో అనిల్‌కుమార్, ఆశాజ్యోతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం ఈశ్వరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గేయాన్ని ఆలపించారు. ఖానాపురం తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ జులూరి సుభాషిణి, సొసైటీలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుమనావాణి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై తిరుపతి, పీహెచ్సీలో వైద్యాధికారి అరుణ్‌కుమార్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం సుధాకర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు జరుపుకున్నారు. తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల్లో తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో కిషన్‌నాయక్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బండారి రాజు, ఇందిరాక్రాంతిలో ఏపీఎం అశోక్‌కుమార్, పీఏసీఎస్‌లో చైర్మన్ రాంచంద్రారెడ్డి, జడ్పీఎస్‌ఎస్‌లో హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ జయకుమారి, ఎమ్మార్సీలో ఎంఈవో నోముల రంగయ్య, పీహెచ్సీలో వైద్యాధికారిణి భూక్యా వెంకటేశ్, ఆయూష్ వైద్యాలయంలో డాక్టర్ రవికుమార్, పశువైద్యశాలలో డాక్టర్ వీరగోని శ్రుతి, టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహనాయక్, జీపీలో సర్పంచ్ నర్సయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కరీమాబాద్ 32, 33, 39, 40, 41, 42, 43 డివిజన్లలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. మామునూరులో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ జెండాను ఎగురవేశారు. కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ ఆయా డివిజన్లలో త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. పీఏసీఎస్‌లో చైర్మన్ కేడల జనార్దన్, శ్రీకళాభారతి కల్చరల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు పుట్ట భోగేశ్వర్, మామునూరు ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ నరేశ్‌కుమార్, పీటీసీలో ప్రిన్సిపాల్ గంగారం, 4వ బెటాలియన్‌లో కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి జెండా ఎగురవేశారు.
వరంగల్ నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు, మాజీ మేయర్ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్ ఎంజీఎం దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీ కరుణాకర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా, యూనివర్సిటీ రెక్టార్ డాక్టర్ టీ వెంకటేశ్వర్లు, రిజిస్ట్రార్ డాక్టర్ డీ ప్రవీణ్‌కుమార్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ వై మల్లీశ్వరి, డిప్యూటీ రిజిస్ట్రార్లు డాక్టర్ రామానుజం, డాక్టర్ సుధాకర్‌రావు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ, వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ మల్లేశ్, వరంగల్ బస్ స్టేషన్లో డిపో మేనేజర్ మోహన్‌రావు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. స్టేషన్ మేనేజర్ ఎండీ గౌస్, సూపర్వైజర్ సీతయ్య, కార్గో ఇన్చార్జి సునీల్ పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలో కొవిడ్ నిబంధనలతో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. నర్సంపేట కోర్టులో జడ్జి శిరీష, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గుంటి రజినీకిషన్, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో పవన్‌కుమార్, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఫణీందర్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ పులి రమేశ్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు ఇరుకు కోటేశ్వర్రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బత్తిని చంద్రమౌళి, ‘తాడు’ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షుడు కల్లెపల్లి సురేశ్, ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అధ్యక్షుడు శింగిరికొండ మాధవశంకర్, మాంటిస్సోరి పాఠశాలలో చైర్మన్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, సిటిజన్ క్లబ్లో ఆర్డీవో పవన్‌కుమార్, గ్రంథాలయ సంస్థలో డైరెక్టర్లు పుట్టపాక కుమారస్వామి, గంప రాజేశ్వర్‌గౌడ్, రామాలయం స్కూల్లో హెచ్ఎం మాడుగుల మల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్ నల్లా భారతి, ఆర్డీసీ డిపోలో డీఎం శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఎగురవేశారు. దుగ్గొండి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, పోలీస్‌స్టేషన్‌లో సీఐ సూర్యప్రసాద్, ఎస్సై నవీన్‌కుమార్, తహసీల్, వ్యవసాయ, సమాఖ్య కార్యాలయాల్లో తాసిల్దార్ సంపత్‌కుమార్, ఏవో దయాకర్, ఏపీఎం రాజ్‌కుమార్, దవాఖానల్లో వైద్యాధికారులు రాజు, స్వప్న, వెటర్నటీ వైద్యులు రామ్మోహన్, బాలాజీ, శారదా జాతీయ పతాకాలను ఎగురవేశారు. అలాగే, పలు కార్యాలయాల్లో జరిగిన వేడుకల్లో విద్యుత్ ఏఈలు సురేశ్, మందపల్లి, మహ్మదాపురం, నాచినపల్లి పీఏసీఎస్‌ల్లో చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, గిర్నిబావి ఎంజేపీటీ గురుకులంలో ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్, ఆదర్శ స్కూల్లో చైర్మన్ రవి, హెచ్ఎం యుగేంధర్, కేజీబీవీలో ఎస్వో మంజుల, న్యూవిజన్ స్కూల్లో చైర్మన్ నర్సింహారెడ్డి, హెచ్ఎం మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాల్లో ఆ పార్టీల మండల అధ్యక్షులు సుకినె రాజేశ్వర్‌రావు, ఎర్రల్ల బాబు, చుక్కా రమేశ్ త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. గిర్నిబావిలో పిల్లలు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో సందడి చేశారు. పర్వతగిరి మండలంలో గణతంత్ర వేడుకలు జరిగాయి.
వరంగల్ చాంబర్ కార్యాలయంలో..
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా, ప్రధాన కార్యదర్శి మాడురి వేదప్రకాశ్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి సంపత్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాశీబుగ్గ ఓసిటీ రోడ్డులోని వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు వద్ద చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు జెండాను ఆవిష్కరించగా, వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్ మంద స్వప్న పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని మార్కెట్ కమిటీ టీఎన్జీవోస్ భవనంలో అధ్యక్షుడు జన్ను భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, జేడీఎం ఎన్నారపు మల్లేశం, డీడీఎం అజ్మీరా రాజునాయక్, కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్, సిబ్బంది గంధమల్ల రాజేందర్ పాల్గొన్నారు. కాశీబుగ్గ 20వ డివిజన్లో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ మీసాల ప్రకాశ్, దూపం సంపత్, కూచన రవీందర్, రామాయాదగిరి జెండా ఆవిష్కరించారు.
వరంగల్ పోచమ్మమైదాన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో త్రివర్ణ పతాకాలను ఎగురువేశారు. వరంగల్ తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ కే సత్యపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధి కార్యాలయంలో రీజినల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జీ ఎల్లయ్య, పోచమ్మమైదాన్‌లో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, దేశాయిపేటలో కార్పొరేటర్ కావటి కవిత, ఎల్బీనగర్లో కార్పొరేటర్ సురేష్‌జోషి, కాశీబుగ్గ, తిలక్‌రోడ్డులో కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్, కొత్తవాడలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి, పోచమ్మమైదాన్‌లో ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ చీఫ్ రహిమున్నీసాబేగం, ఎల్బీనగర్లో పద్మశాలి సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సుంకపల్లి శ్రీనివాసులు, దేశాయిపేట రోడ్డులో టీఆర్ఎస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కొత్తవాడ, గౌతమీనగర్‌లో సీపీఐ రాష్ట్ర నాయకుడు టీ వెంకట్రాములు జెండాను ఎగురవేశారు. 21వ డివిజన్లో డుబాసి సమ్మక్క ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు. 12వ డివిజన్ గాంధీనగర్‌లో ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందిన గుండా అశోక్-లావణ్యను కాలనీ కమిటీ సన్మానించింది. గీసుగొండ తహసీల్, ఎంపీడీవో, వ్యవసాయ కార్యాలయాల్లో తాసిల్దార్ సుహాసిని, ఎంపీడీవో రమేశ్, ఏవో హరిప్రసాద్‌బాబు, జిల్లా గ్రంథాలయంలో చైర్మన్ బొచ్చు వినయ్, పీహెచ్సీలో వైద్యాధికారి మాధవీలత, పోలీస్‌స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు, పశువైద్య కేంద్రంలో వైద్యాధికారి రమేశ్, మండల సమాఖ్యలో ఏపీఎం సురేశ్‌కుమార్ జెండాలు ఆవిష్కరించారు. గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో యువజన సంఘాలు, ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో గణతంత్ర వేడుక సందర్భంగా మువ్వన్నెలా జెండాను ఆవిష్కరించారు. సంగెం ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో ఎంపీడీవో ఎన్ మల్లేశం, తాసిల్దార్ రాజేంద్రనాద్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై హరిత, పీహెచ్సీలో డాక్టర్ అశోక్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో యాకయ్య, కేజీబీవీలో ప్రత్యేకాధికారి నీలిమ, గవిచర్ల మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ రహమాన్, ఐకేపీలో ఏపీఎం కిషన్, సంగెం జీపీలో సర్పంచ్ గుండేటి బాబు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వరంగల్ వేణురావు కాలనీలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) వరంగల్ బ్రాంచ్‌లో చైర్మన్ సీఏ రవికుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఈ నెల 24న జరిగిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో గెలిచిన రాజు టీంకు బహుమతులు అందజేశారు. మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ సీహెచ్ రమేశ్, వరంగల్ డివిజనల్ ఫైర్ ఆఫీస్‌లో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మామిడి భగవాన్‌రెడ్డి, రామన్నపేటలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి గీతాల పోటీల్లో గెలుపొందిన గజ్జెల శరణ్య కు బహుమతి అందజేశారు. పోతనరోడ్లో మాజీ కార్పొరేటర్ మెడకట్ట సారంగపాణి పతాకావిష్కరణ గావించారు.