SL vs ZIM : చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిశాంక(62) అర్ధ శతకంతో చెలరేగాడు. వేదికగా జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అర్ధ శతకంతో కదం తొక్కాడు. బ్లెస్సింగ్ ముజరబని(2-38), ఎవాన్స్(2-35) మిడిల్ ఓవర్లలో వికెట్ల వేటతో పరుగులు కట్టడి చేసినా.. పవన్ రత్ననాయకే(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడాడు. చివరి ఓవర్లో దునిత్ వెల్లలాగే(15 నాటౌట్) మూడు బౌండరీ బాదగా శ్రీలంక 178 స్కోర్ చేసింది.
అదిరే ఆటతో సూపర్ 8కు చేరువైన శ్రీలంక చివరి లీగ్ మ్యాచ్‌లోనూ దంచేసింది. ఆస్ట్రేలియాపై సెంచరీతో మెరిసిన ఓపెనర్ పథుమ్ నిశాంక(62) జింబాబ్వేపైనా ఉతికేశాడు. కుశాల్ పెరీరా(22)తో తొలి వికెట్‌కు 54 రన్స్.. కుశాల్ మెండిస్(14)తో కలిసి స్కోర్ సెంచరీ దాటించిన నిశాంక అర్ధ శతకం తర్వాత గ్రేమీ క్రీమర్(2-27) ఓవర్లో ఔటయ్యాడు. కాసేపటికే కమిందు మెండిస్(7)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.
The second-highest total at the R Premadasa this World Cup!
There was a bit of a wobble, but Sri Lanka continues to find a way 👏 pic.twitter.com/n7ghshiH8H
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2026
అయితే.. రత్ననాయకే బౌండరీలతో చెలరగగా లంక స్కోర్ బోర్డు ఊపందుకుంది. హాఫ్ సెంచరీకి చేరువైన రత్ననాయకేను ఔట్ చేసిన ఎవాన్స్.. ఆ తర్వాత బంతికే దుషాన్ హేమంతను డగౌట్ చేర్చాడు. కానీ, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వెల్లలాగే(15 నాటౌట్) మూడు ఫోర్లు బాదేసి ఆతిథ్య జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 7 వికెట్ల నష్టానికి 178 రన్స్ కొట్టిన లంకను జింబాబ్వే ఓడించాలంటే టాపార్డర్ రాణించాల్సిందే.