POCSO Act | పొక్సో చట్టం పిల్లలకు సరైన రక్షణ : దండు మోహన్
భారత ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం 2012లో రూపొందించిన (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) పోక్సో చట్టం పిల్లలకు సరైన రక్షణ కల్పిస్తుందనీ ప్యానెల్ అడ్వొకేట్ దండు మోహన్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: భారత ప్రభుత్వం పిల్లల రక్షణ కోసం 2012లో రూపొందించిన (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) పోక్సో చట్టం పిల్లలకు సరైన రక్షణ కల్పిస్తుందనీ ప్యానెల్ అడ్వొకేట్ దండు మోహన్ తెలిపారు. హనుమకొండ జిల్లా ఉచిత న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, జడ్జీ ఎన్.వెంకట హైమా పూజిత ఆదేశాల మేరకు హనుమకొండ రెడ్డికాలనీలోని బాసిత్‌నగర్ ప్రభుత్వ హై స్కూల్లో మంగళవారం పోక్సో చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన అడ్వకేట్ మోహన్ మాట్లాడుతూ ఈ చట్టం 18 సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు వర్తిస్తుందని, లైంగిక వేధింపుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నాలని తగిన మెలకువలను పిల్లలకు వివరించారు. ఎవరో చేసిన తప్పిదానికి పిల్లలు బాధ్యులు కారని, సహాయం కోరి వచ్చిన బాధిత పిల్లలకు తగిన సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ చట్టం ప్రకారం నేర తీవ్రతనుబట్టి 10 ఏండ్ల నుంచి 20 సంవత్సరాలు, యావజీవ కారాగారం, మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందన్నారు.
బాధిత పిల్లలు తమకు నమ్మదగిన వ్యక్తుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం డీఎల్ఎస్ఏలో కూడా దరఖాస్తు చేసుకోవాలని మోహన్ కోరారు. ఈ సందర్భంగా పిల్లలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించే బ్రోచర్లను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాది సుందర్‌రామ్, బాసిత్‌నగర్ హెడ్మాస్టర్ పరమేశ్వర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

