JNS | జేఎన్ఎస్లో ముగిసిన రీజినల్ స్పోర్ట్స్హాస్టల్ సెలక్షన్స్
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో రెండు రోజుల పాటు నిర్వహించిన రీజినల్ స్పోర్ట్స్హాస్టల్ సెలక్షన్స్మంగళవారం ముగిశాయి.
హనుమకొండ చౌరస్తా, జూలై 28: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూస్టేడియం(జేఎన్ఎస్)లో రెండు రోజుల పాటు నిర్వహించిన రీజినల్ స్పోర్ట్స్హాస్టల్ సెలక్షన్స్మంగళవారం ముగిశాయి. రాష్ర్టవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 450 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ విభాగాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ హనుమకొండ రీజినల్ స్పోర్ట్స్హాస్టల్లో అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, రాష్ర్టం నలుమూలల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం స్పోర్ట్స్ హాస్టల్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.
ప్రతిభ ఆధారంగానే ఎంపికలు చేపట్టామని, ఎంపికైన క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందించి రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. ఎంపికైన క్రీడాకారులకు త్వరలో సమాచారం అందజేస్తామని తెలిపారు. ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీష్‌రెడ్డి (జిమ్నాస్టిక్స్ కోచ్), దీపక్ప్రసాద్ (హ్యాండ్ బాల్ కోచ్), సుధాకర్‌యాదవ్ (రెజ్లింగ్ కోచ్), సంతోష్‌చారి(స్విమ్మింగ్ కోచ్), రాజేష్(అథ్లెటిక్స్ కోచ్) పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు, స్టాఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

