ఖిలావరంగల్, జనవరి 25: రన్నింగ్‌లో ఓరుగల్లు ఆణిముత్యం పతకాలను సాధిస్తున్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గోపగాని దివ్య రన్నింగ్, షాట్‌పుట్‌లో రాణిస్తోం ది. 2017లో రన్నింగ్‌పై మక్కువతో పరుగు పందెంలోకి దిగి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. వరంగల్ జిల్లా ఆదర్శనగర్‌కు చెందిన గోపగాని శంకర్-మహేశ్వరి దంపతుల కూతురు గోపగాని దివ్య ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. తల్లిదండ్రులు కిరాణం దుకాణం నిర్వహిస్తూ కూతురికి ఇచ్చిన ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుల సలహాలు సూచనలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నది.
సాధించిన పథకాలు
హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో 2017 జనవరి 16,17 తేదీలో జరిగిన 400 మీటర్ల పరుగు పం దెంలో విజేతగా నిలిచి తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎల్బీ కళాశాలలో 2019 డిసెంబర్ 17 నుంచి 19 వరకు జరిగిన 200 మీటర్ల పరుగు పందెంతో పాటు షార్ట్పుట్లో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతిని అందుకుంది.
గోవాలో 2021లో జరిగిన నేషనల్ యూత్ గేమ్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంలో నిలించి సిల్వర్ మెడల్‌ను సాధించింది.
2021-22 5వ నేపాల్ ఇంటర్నేషనల్ హీరోస్ చాంపియన్‌షిప్ పోటీలో 800 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం కైవసం చేసుకుని బంగారు పతకం సాధించించింది. అలాగే షార్ట్పుట్లో ద్వితీయ స్థానం గెలుపొంది వెండి పతకం సాధించింది.