Avula Sumalatha | ఆవుల సుమలతకు పీహెచ్డీ ప్రదానం
వరంగల్ ఎల్లంబజార్కు చెందిన ఆవుల సుమలత చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 17: వరంగల్ ఎల్లంబజార్కు చెందిన ఆవుల సుమలత చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. యూనివర్సిటీ ఫౌండర్, ఛాన్సలర్ సీహెచ్వీ పురుషోత్తంరెడ్డి చేతులమీదుగా ఆమె డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ‘ఎక్స్ప్లేనేషన్ ఆఫ్ మెషీన్ లర్నింగ్ మెథడ్స్ ఫర్ ప్రీడిక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ సాయిల్ ప్రాపర్టీస్’ అనే అంశంపై ఆమె పరిశోధన నిర్వహించారు. డాక్టర్ జి.మాధవి పర్యవేక్షణలో ఈ పరిశోధన పూర్తిచేశారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా ఆమె పరిశోధన సాగింది.
మెషిన్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా వ్యవసాయ నేల లక్షణాలను అంచనా వేసే అంశంపై అధ్యయనం చేశారు. కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించు కుంది. ఈ సందర్భంగా సుమలతను కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | ఆగివున్న టిప్పర్ను ఢీకొట్టిన వ్యాన్.. ముగ్గురు దుర్మరణం..!
Dhurandhar | ‘ధురంధర్’కి నిరాశ.. గ్రామీ నామినేషన్లలో చోటు దక్కని రణ్వీర్ సింగ్ చిత్రం
Show Cause Notices | కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు ..ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
Thousand Pillar Temple | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి పుష్పాభిషేకం
‘ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లను అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

